Telugu News

బుల్లెట్ వేగంతో రన్నింగ్ లో బంగారు పథకాలు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటిన తెలుగు కెరటాలు

గార్ల-విజయం న్యూస్

0

బుల్లెట్ వేగంతో రన్నింగ్ లో బంగారు పథకాలు అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తాను చాటిన తెలుగు కెరటాలు

(గార్ల-విజయం న్యూస్) :- 

నవంబర్ 22 నుండి 25వరకు ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేపాల్ లోని పోక్ర లో నిర్వహించిన ఏషియా యూత్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2021 లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 3000 మీటర్ల సీనియర్ ఏజీ క్యాటగిరిలో పి.ప్రశాంత్, 3000 మీటర్ల అండర్ 17విభాగంలో కె.కిరణ్, 100మీటర్ల అండర్ 17విభాగంలో ఎస్.హర్షవర్ధన్, 200మీటర్ల అండర్ 17క్యాటగిరిలో ఎం.అభినవ్ లు మెరుపు వేగంతో తమదైన శైలిలో తమ సత్తాను చాటి బంగారు పధకాలను సాధించి క్రీడల నిర్వాహకులను, క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచేలా చేశారని ఏషియా యూత్ ఛాంపియన్ షిప్ నేపాల్ ఆర్గనైజర్ ప్రదీప్ ఓ ప్రకటనలో తెలిపారు. వారిని ఆల్ ఇండియా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఇండియా సెక్రెటరీ మాలిక్, తెలంగాణ రాష్ట్ర సెక్రెటరీ మారగౌని సుదర్శన్ గౌడ్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రావూరి ప్రశాంత్, రంగారెడ్డి జిల్లా ఆతెలిటిక్స్ కోచ్ తిప్పానిసాయి రెడ్డి తదితర ప్రముఖులు వారిని అభినందించారు.

also read :- తనయుడి చేతిలో తల్లి హతం..