Telugu News

మహిళకు షాక్.. చెవిలో గూడు కట్టిన సాలీడు

అశ్ఛర్యపోయిన డాక్టర్. బెదిరిపోయిన యువకుడు

0

యువతికి షాక్.. చెవిలో గూడు కట్టిన సాలీడు

అశ్ఛర్యపోయిన డాక్టర్. 

తన చెవి లో దరద, అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో పాటు చెవి నుంచి వింత శబ్దాలు వస్తున్నట్లు గుర్తించిన ఓ మహిళ డాక్టర్ వద్దకు వెళ్ళింది. ఆ మహిళ చెవిని పరీక్షించిన డాక్టర్ షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ మహిళ చెవిలో సాలీడు గూడు కట్టుకుని నివసిస్తుందని పరీక్షలో తేలింది. నిజానికి మహిళ చెవి ప్రాబ్లెం గురించి డాక్టర్ తెలుసుకుని ముందుగా చెవి రంధ్రంలో ఎదో అడ్డు పడి ఉంటుంది.. అది తొలగించాలని చెవిలో కెమెరా పెట్టి పరీక్షించాడు.. అయితే అప్పుడు సాలీడు కనిపించడంతో వైద్యుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన చైనా లో చోటు చేసుకుంది. దక్షిణ చైనాలోని హునాన్ ప్రావిన్స్లోని యీ అనే మహిళ తన చెవిలో ఏదో ఉన్న ఫీలింగ్ కలిగింది, అంతేకాదు చెవి నుంచి వింత శబ్దాలు రావడం ప్రారంభించాయి. ఇక చెవులో భరించలేని దురద ఇబ్బంది కలిగింది. దీంతో తన చెవికి ఇన్ఫెక్షన్ సోకిందని భావించి వెంటనే ఇయర్ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు వెళ్ళింది. డాక్టర్ చెవికి చేసిన పరీక్షల్లో ఒక సాలీడు గూడు కట్టుకున్నట్లు గుర్తించాడు. ఆ సాలీడు చాలా పెద్దదిగా ఉన్నట్లు పరీక్షలో తెలిసింది. దీంతో చెవి నుంచి ఎలక్ట్రిక్ ఓటోస్కోపు ఉపయోగించి సాలీడు తొలగించారు. ఒక రోజు ఆస్పత్రిలో ఉన్న యీ డిశ్చార్జ్ అయ్యింది. .

also read ;- సెల్ ఫోన్ కోసం భార్యను అమ్మేసిన భర్త