Telugu News

నేడు సీఐడీ కస్టడీకి చంద్రబాబు

జైళ్ళోనే విచారించనున్న సిఐడి అధికారులు

0

నేడు సీఐడీ కస్టడీకి చంద్రబాబు

== జైళ్ళోనే విచారించనున్న సిఐడి అధికారులు

== రెండు రోజుల పాటు విచారణ

(విజయవాడ -విజయం న్యూస్)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియ మరింత ముందుకు సాగుతోంది. చంద్రబాబు తరుపు న్యాయవాదులు హైకోర్టు లో వేసిన పిటిషన్లను కొట్టేసిన కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వందల మందిని విచారణ చేసిన తరువాత ఆ కేసును, విచారణను ఆపమని చెప్పలేమని చంద్రబాబు కు షాక్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి:- 14ఏళ్ల సీఎం..14 రోజుల జైలుకు చంద్రబాబు

చంద్రబాబు క్ర్యాష్ పిటిషన్ ను కొట్టేసినట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో చంద్రబాబు, ఆయన లాయర్లు షాక్ కు గురైయ్యారు. ఇదిలా ఉండగా మరో వైపు ఏసీబీ కోర్టు చంద్రబాబు కు మరోసారి షాక్ ఇచ్చింది. చంద్రబాబు ను సీఐడీ కస్టడీకి ఇవ్వనున్నట్లు తీర్పు ఇచ్చింది.సీఐడీ కస్టడీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్న సీఐడీ అధికారులు..ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5,గంటల వరకు విచారణ జరిపించాలని న్యాయమూర్తి సీఐడీ అధికారులకు సూచించారు. ప్రతి గంటకు 5నిమిషాల పాటు బ్రేక్ ఇవ్వాలని, మధ్యాహ్నం 1 గం నుంచి 2 గం వరకు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సూచించింది. విచారణ సమయంలో ఒక్కరు లేదా ఇద్దరు లాయర్లకు అనుమతినిచ్చిన కోర్టు..విచారణ కు ముందు.. విచారణ తరువాత వైద్య పరీక్షలు చేయాలని, వీడియోలు, పోటోలు బయటకు రావొద్దని, విచారణ కాపీలను సీల్డ్ కవర్ లో ఉంచాలని సీఐడీకి న్యాయమూర్తి సూచించారు.

ఇది కూడా చదవండి:- చంద్రబాబు అర్థరాత్రి అరెస్ట్ తప్పిదమే: తుమ్మల

కాగా న్యాయమూర్తి ఆదేశాలు మేరకు శనివారం ఉదయం 9.30 గంటలకు సెంట్రల్ జైళ్ళోనే విచారణ చేయనున్నట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే సీఐడీ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే మరో రెండు రోజులు పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. మరీ చంద్రబాబు నాయుడు, సీఐడీ అధికారుల విచారణలో ఏంజరుగుతుందో వేచి చూడాల్సిందే.