అన్నల అలజడి
*సీజీలో చెట్లు నరికి రహదారికి అడ్డంగా పడేసిన మావోయిస్టులు*
( భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్ )
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా రాయనార్ గ్రామ సమీపంలో ఓర్చా ప్రధాన రహదారిపై మంగళవారం అర్థరాత్రి మావోయిస్టులు చెట్టు నరికి రోడ్డుకి అడ్డంగా పడేసి ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించారు. బస్తర్ ఫైటర్స్‌లో ఆదివాసీ యువత చేరవద్దని పిలుపునిస్తూ సంఘటన ప్రాంతంలో మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. నారాయణపూర్ ఎస్‌పి సదానంద కుమార్ ఈ సమాచారం అందుకున్న వెంటనే ధనోరా, ఓర్చా ప్రాంతాల భద్రతా బలగాలను అక్కడికి పంపి గాలింపు చర్యలు చేపట్టి రహదారిపై అడ్డాంగా ఉన్న చెట్లను తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు. జిల్లాలోని ధనోరా, ఓర్చా ప్రాంతాలు తీవ్ర నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా పరిగణించబడుతున్నాయి.
Allsp read:- ఉలిక్కిపడిన అమెరికా..ఎందుకోసమంటే..
అబూజ్‌మద్‌కు ఆనుకుని ఉన్న చాలా గ్రామాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. నక్సలైట్లు తమ ఉనికిని చాటుకునేందుకు చెట్లను నరికివేయడం, బ్యానర్ పోస్టర్లు అంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. అభివృద్ధి పనులతో ఆందోళన చెందుతున్న మావోయిస్టులు ఇలాంటి సంఘటనతో ఉనికిని చాటే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్‌పి సదానంద కుమార్ ఆరోపించారు.