Telugu News

ఛత్తీస్‌ఘడ్‌లో మావోల దుశ్చర్య

= రోడ్డు పనులు జరగకుండా వాహనాలకు నిప్పు

0

ఛత్తీస్‌ఘడ్‌లో మావోల దుశ్చర్య
== రోడ్డు పనులు జరగకుండా వాహనాలకు నిప్పు
(చత్తీస్ గడ్-విజయంన్యూస్)
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనులు చేస్తుండగా 12 వానాలకు నిప్పు పెట్టారు. రహదారి నిర్మాణం పూర్తయితే వారి ఉనికికి ప్రమాదమని భావించి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. బీజాపూర్‌, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో 12 వాహనాలకు నిప్పు పెట్టారు.

also read :-సాకివాగు అటవీప్రాంత ఘటన దారుణం : మంత్రి సత్యవతి

బామ్రా గఢ్‌ ప్రాంతంలో ప్రధానమంత్రి గ్రావిూణ సడక్‌ యోజన పథకం కింద దోదరాజ్‌ నుంచి కవండే వరకు రోడ్లు వేస్తుండగా ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం.రోడ్డు నిర్మాణం పూర్తయితే వారి ఉనికి ప్రమాదమని భావించి… వాహనాలను తగలబెట్టినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో నిర్మాణ ప్రదేశం వద్దకు వచ్చిన మావోయిస్టులు… రహదారి పనులు చేస్తున్న సిబ్బందిని చితకబాది… 9 ట్రాక్టర్లు, రెండు జేసీబీలు, డోజర్లను తగులబెట్టారు