యూపిలో స్పష్టమైన ఆధిక్యం దిశగా బిజెపి
== 270 స్థానాల్లో ముందంజలో ఉన్న అభ్యర్థులు
== 128 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తున్న ఎస్పీ
== రెండు సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్
== బిఎస్పీ మరీ దారుణంగగా ఒక్క సీటుకే పరమితం
(లక్నో-విజయంన్యూస్):
అనుకున్నట్లే ఉత్తరప్రదేశ్‌ను మరోసారి బీజేపీ నిలబెట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే యూపీలో బీజేపీ దూసుకెళ్లింది. దాదాపు 270 సీట్లలో బిజెపి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇకపోతే ఎస్పీ 128 సీట్ల ఆధిక్యంలో రెండోస్థానంలో ఉంది. కాంగ్రెస్ కేవలం రెండు సీట్లలో మాత్రమే ఆధిక్యాన్ని పొందింది. గతంలో పాలన చేసిన బిఎస్పీ కేవలం ఒక్క స్థానంలోనే ముందంజలో ఉంది. ఈ ఫలితాలతో మరోమారు యోగి ఆదిత్యనాథ్ యూపిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. 2017 మాదిరిగానే ఈసారి కూడా బీజేపీ తనకు ఎదురులేదని నిరూపించింది. ఎలాంటి సందిగ్ధతకు తావులేకుండా పూర్తి మెజారిటీతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షాల వ్యూహా రచన మరోసారి ఫలించింది.
also read :-మాది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వం
ఈ విజయంలో వారిదే కీలక భూమిక. ఇదిలాఉంటే.. తాజాగా వెలువడిన యూపీ ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. ఏడు దశల్లో జరిగిన ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి, ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీలో చేరిన నేత స్వామి ప్రసాద్ మౌర్య వెనుకంజలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఫజిల్ నగర్ స్థానంలో ఆయన బీజేపీ అభ్యర్థి సురేంద్ర కుమార్ కుష్వాహా కన్నా సుమారు 11,000 ఓట్ల మేరకు వెనుకబడి ఉన్నట్లు తాజా సమాచారం. ఓబీసీ వర్గాల్లో గట్టి పట్టు ఉన్న మౌర్య జనవరిలోనే బీజేపీని వీడి ఎస్పీలో చేరారు. కంచుకోట వంటి పడ్రౌనాను వదిలి ఈసారి ఫజిల్ నగర్ నుంచి పోటీ చేశారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సుమారు 15,000 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
also read :-తెలంగాణకు బయలుదేరిన బుల్డోజర్లు
యోగి కేబినెట్లోని మంత్రులు శ్రీకాంత్ శర్మ, చౌదరి లక్ష్మీ నారాయణ్ మధుర జిల్లాలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సీఎం యోగి తన ఐదేళ్ళ పదవీ కాలంలో దాదాపు 20సార్లు మధురలో పర్యటించారు. మధుర అభివృద్ధి కోసం బ్రజ్ తీర్థ్ వికాస్ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కర్హాల్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఆర్ఎల్డీ`ఎస్పీ కూటమి విూరట్‌లోని మూడు నియోజకవర్గాల్లోనూ పరాజయం దిశగా కదులుతోంది. ఈ పార్టీల అధినేతలు జయంత్, అఖిలేశ్ తమ కూటమిని విూరట్లోనే ప్రకటించారు.
టమ్కుహి రాజ్ నియోజకవర్గంలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ వెనుకంజలో ఉన్నారు. ఎస్పీ నేత అబ్దుల్లా అజాం ఖాన్ దాదాపు 7,000 ఓట్లతో ముందంజలో ఉన్నారు.