Telugu News

త్వరలోనే టెట్ నోటిఫికేషన్

అశ్వారావుపేట విజయం న్యూస్

0

త్వరలోనే టెట్ నోటిఫికేషన్

(అశ్వారావుపేట విజయం న్యూస్):-

ఉపాధ్యాయ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్ప నున్నది.
తెలంగాణలో రెండు మూడు రోజుల్లోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహించేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

also read;-హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు

ఈ పరీక్షను ఎప్పటిలానే ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని అమె తెలిపారు. రానున్న భారీ ఉద్యోగాల భర్తీ నేపథ్యంలో.. ఉపాధ్యాయుల నియామకాలు డీఎస్సీ ద్వారా జరగనున్నాయా? లేక టీఎస్పీఎస్సీ చేపడుతుందా అన్న విషయంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలు కానున్నందున.. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.