దేశంలో ఒడివడిగా పెరుగుతున్న కరోనా కేసులు
== ప్రజల్లో మొదలైన పోర్త్ వేవ్ ఆందోళన
== అప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్యశాఖ
== ముందస్తు చర్యలకు దిగిన పలు రాష్టాల్రు
(హైదరాబాద్-విజయంన్యూస్):-
దేశంలో కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఫోర్త్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 56 మంది మృతి చెందారు. 1231 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 13,433 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,30,49,974 కరోనా కేసులు నమోదు అయ్యాయని, 5,22,062 మంది మృతి చెందగా.. 4,25,14,479 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిరచారు. దేశంలో కొవిడ్ ఫోర్త్‌వేవ్ రాలేదని అయినా ముందస్తు చర్యలు పాటించాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా పేర్కొంది. ఇదిలావుంటే కేసుల పెరుగుదలతో పలు రాష్టాల్రు మళ్లీ అప్రమత్తం అవుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కర్నాకట ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అంతా జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. అర్హత కల్గినవారంతా బూస్టర్‌డోసు వేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఢల్లీితోపాటు పలుచోట్ల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
also read :-భారత్ లో పర్యటిస్తున్నబోరిస్
ఇందుకు సంబంధించి ప్రత్యేక సవిూక్ష జరిపి మార్గదర్శకాలను సూచిస్తామన్నారు. 29`30 లక్షలమంది రెండోడోసు వేసుకోవాల్సి ఉందన్నారు. బెంగళూరు, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలపై నిరంతర పర్యవేక్షిస్తామని తెలిపారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ టీకాలపై చైతన్యం తీసుకురావాలన్నారు. 25 ఏళ్లు పైబడినవారు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని, స్వామిజీలు మినహాయింపు కాదన్నారు. కేసీ జనరల్ ఆసుపత్రిలో తల్లీబిడ్డల ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. ఇదిలావుంటే దేశంలో ఢల్లీి, ఉత్తరప్రదేశ్, హర్యానా, మిజోరామ్, మహారాష్ట్ర తదితర రాష్టాల్లో మళ్ళీ కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని తమిళనాడు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జె.రాధాకృష్ణన్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మంది కరోనా బాధితులు మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, 38 జిల్లాలకు గాను 30 జిల్లాల్లో కరోనా కేసులు లేవని తెలిపారు.
also read;-పెను ముప్పు తప్పదా? భగ్గుమంటున్న భానుడు..
ఉత్తరాదిలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అక్కడి నుంచి రాష్టాన్రికి వచ్చేవారి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికి ఆరోగ్య సిబ్బంది ద్వారా జిల్లా కలెక్టర్లు తీవ్ర నిఘా ఏర్పాటు చేయాలని, అవసరమైతే ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు గతంలా ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలని సూచించారు. అదే సమయంలో ఆయా జిల్లాల్లో వ్యాక్సిన్ వేసుకోనివారిని, మొదటి డోస్ వేసుకుని రెండో డోస్ వేసుకోనివారిని వ్యాక్సిన్ శిబిరాలకు తరలించి టీకాలు వేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగకుండా ప్రజలంతా తప్పకుండా ముఖాలకు మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం కోరారు. సైదాపేట బస్‌డిపోవద్ద రవాణా కార్మికుల రెస్ట్‌రూమ్‌ను బుధవారం ఉదయం ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ గత నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య యాభైకి తక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఉత్తరాది రాష్టాల్ల్రో కరోనా వైరస్ విజృంభిస్తోందని, ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యహరించాల్సిన అవసరం ఉందని, ఆ మేరకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.