Telugu News

చైనాలో కరోనా మళ్ళీ పంజా!

-చైనాలో కరోనా మళ్లీ విళయతాండవం సృష్టిస్తోంది.

0

చైనాలో కరోనా మళ్ళీ పంజా!

—చైనాలో కరోనా మళ్లీ విళయతాండవం సృష్టిస్తోంది.

(చైనా విజయం న్యూస్):-

ఆ దేశ వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చైనాలో గత 24 గంటల్లో 16,412 కరోనా కేసులు నమోదుకాగా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కఠినమైన ఆంక్షలతో పాటు నగరవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది చైనా.

షాంఘైలో 26 మిలియన్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాల్సి వచ్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కఠిన ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేస్తారో అధికారులు వెల్లడించలేదు.

also read :-శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: డీసీపీ అఖిల్ మహాజన్

2019 చివరిలో కరోనావైరస్ పుట్టిన వుహాన్‌లో కరోనా వైరస్ కేసుల తీవ్రత కంటే ఇదే చైనాలో అతిపెద్దదిగా పీఎల్ఏ తెలిపింది. చైనాలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, వాలంటీర్లు మొత్తం జనాభాకు టెస్టులు నిర్వహించేందుకు, నిత్యావసర వస్తువులను సరఫరాకు భారీ అంతరాయం ఏర్పడింది