***దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం : సీఎం కేసీఆర్
***(ముంబై విజయం న్యూస్):-
ముంబై : దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించాం. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించాం.. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
also read :-జిల్లాలో ఎంపీ నామ సుడిగాలి పర్యటన
దేశ రాజకీయాలపై చర్చించేందుకే మహారాష్ట్రకు వచ్చాను. కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించాం. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. వైఖరి మార్చుకోకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవు అని సీఎం హెచ్చరించారు. హైదరాబాద్ రావాలని ఉద్ధవ్ ఠాక్రేను కోరుతున్నాను. ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతాం. శివాజీ, బాల్ ఠాక్రే వంటి యోధుల స్ఫూర్తితో రాబోయే రోజుల్లో పోరాడుతాం. పటిష్టమైన దేశం కోసం అందరూ కృషి చేయాలి. దేశంలో గుణాత్మకమైన మార్పు అవసరం. అన్ని విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. రాబోయే రోజుల్లో కలిసి పని చేయాలని నిర్ణయించాం. త్వరలో హైదరాబాద్‌లో లేదా మరో చోట అందరం నేతలం కలుస్తాం. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
also read :-*బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ..
రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులతో తెలంగాణ స్వరూపం మారిపోయింది. తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సరిహద్దు 1000 కిలోమీటర్లు ఉంది. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. 75 ఏండ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు నెలకొన్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు