ఉలిక్కిపడిన అమెరికా..ఎందుకోసమంటే..
(న్యూయార్క్-విజయంన్యూస్);-
ప్రపంచ రారాజు అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఓ వ్యక్తి జరిపిన కాల్పులతో ఒక్కసారిగా హాడలెత్తింది. దుండగుడు ప్రయాణికులపై కాల్పులు జరిపాడు.. కండ్లు మూసుకుని కాల్పులు జరపడంతో పాటు బాంబుదాడి జరిగింది. ఈ కాల్పుల్లో ఆరుగురు చనిపోగా, 13మందికి గాయాలైయ్యాయి. అమెరికాలోని న్యూయార్క్ పటణంలో బ్రూక్లిన్ సబ్ వే స్టెషన్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మాస్క్ ధరించి ప్రయాణికులపై కాల్పులు జరిపిన దుండగుడు, పరారైయ్యాడు.
also read :-భద్రాద్రి రామయ్యకల్యాణ తలంబ్రాలు,ప్రసాదాన్ని సీఎం కేసీఆర్ అందజేత
ఈ కాల్పుల్లో ఆరుగురు మ్రుతి, 13మందికి గాయాలైయ్యాయి. గాయాలైన వారిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాల్పుల ఘటనకు సంబంధించిన ఉన్మాది కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఘటనతో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అయితే దుండగులు చేసిన కాల్పులా, లేదంటే ఎవరైనా ఉన్నాది చేసిన ఘటన లేదంటే ఉగ్రదాడి జరిగిందా..? అనే కోణంలో పోలీసులు, ప్రభుత్వం ఆరాతీస్తోంది.