ఓటమి పాపమెవరిది?
బాధ్యులెవరో తేల్చాలి..
తక్షణమే ఏఐసీసీ భేటీ జరపాలి
(విజయం న్యూస్);-
కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడు కావాలిఆ ప్రక్రియను వేగవంతం చేయాలి
పార్టీలోని జి-23 నేతల డిమాండ్‌ఈ ఫలితాలతో నా గుండె మండుతోంది!ఒక రాష్ట్రం తర్వాత మరోటి కోల్పోతున్నాంసీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆవేదనఆయనతో సిబల్, తివారి, ఆనంద్‌శర్మ భేటీనేడు జి-23 నేతల సమావేశం
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం ఆ పార్టీ సీనియర్ నేతలను కలవరపరుస్తోంది. ఈ ఓటమికి బాధ్యులెవరో తేల్చాలని జి-23 అసమ్మతి నేతలు డిమాండ్ చేశారు. తక్షణమే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని సమావేశపరచాలని, పరాజయంపై చర్చించాలని అన్నారు. అలాగే కొత్త ఏఐసీసీ అధ్యక్షుడిని వీలైనంత త్వరగా నియమించాలని.. ఈ ఎన్నికకు సంబంధించిన సంస్థాగత ప్రక్రియను వేగిరపరచాలని కోరారు. మరోవైపు.. ఎన్నికల్లో పార్టీ చావుదెబ్బ తినడం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ అన్నారు.
also read;-తుమ్మలది టీఆర్ఎస్ రెబల్ కాదు..టీఆర్ఎస్సే
ఒక రాష్ట్రం తర్వాత మరొకటి కోల్పోవడం చూసి తన గుండె మండుతోందని శుక్రవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ బలహీనతలను, లోపాలను అధిగమించాలని కొంతకాలంగా తాను, తన సహచరులు కోరుతూ వస్తున్నామని గుర్తుచేశారు. పార్టీ నాయకత్వం వీటిని పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. కాంగ్రె్‌సలో కీలక మార్పులదిశగా అధిష్ఠానం నిర్ణయాలు తీసుకోవాలని, కనిపించే నాయకత్వం కావాలంటూ ఆజాద్ సహా 23 మంది సీనియర్లు (జి-23) గతంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. వీరిలో కపిల్ సిబల్, మనీశ్ తివారీ, ఆనంద్ శర్మ శుక్రవారం ఆజాద్‌ను ఆయన నివాసంలో కలిసి చర్చించారు. పై డిమాండ్లు చేశారు. తాజా ఫలితాలు, పరిణామాలపై చర్చించేందుకు జి-23 నేతలంతా శనివారం ఇక్కడ భేటీ కానున్నట్లు తెలిసింది. నరేంద్ర మోదీ మొదటిసారి ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు 2014లో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి ఉండేది. వరుస ఎన్నికల్లో పరాజయాలతో ఇప్పుడు రెండు రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్‌కే పరిమితం కావడం సీనియర్లను ఆందోళనకు గురిచేస్తోంది.పంజాబ్‌లో ముస్లింలు ఉన్నారా?బీజేపీ హిందూ-ముస్లిం కార్డు ప్రయోగించి గెలుస్తోందని ప్రతిసారీ సాకు చెప్పడం తగదని కాంగ్రెస్ యువ నేత ఒకరు నాయకత్వానికి హితవు చెప్పారు. ‘పంజాబ్‌లో ముస్లింలు ఎక్కడున్నారు?
also read;-తెలంగాణకు బయలుదేరిన బుల్‌డోజర్లు
ఆ మాటకొస్తే ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ల్లో మాత్రం ఉన్నారా? మనం నిజం ఒప్పుకోవాలి. మా నాయకత్వం విశ్వసనీయత కోల్పోయింది’ అని ఆయన వాపోయారు.ఆప్ తదుపరి లక్ష్యం హిమాచల్: సల్మాన్ ఖుర్షీద్‌పంజాబ్‌ను ఊడ్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తదుపరి టార్గెట్ హిమాచల్ ప్రదేశ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. ‘పంజాబ్‌తో ఆ రాష్ట్రానికి ఉన్న సరిహద్దుల్లో చాలా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అక్కడ ఆప్ ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశముంది. ఈ సవాల్ గురించి మా నాయకత్వానికి తెలుసా? తెలిస్తే దానిని అడ్డుకోవడానికి ఏమైనా చేస్తోందా? నాకైతే తెలియదు’ అని పేర్కొన్నారు.ఓటమి ఊహించనిదేం కాదు: పృథ్వీరాజ్ చవాన్‌ఐదు రాష్ట్రాల ఫలితాలు తీవ్ర నిరాశానిస్పృహలకు గురిచేసినా.. కాంగ్రెస్ ఓటమి ఊహించనిదేమీ కాదని మరో సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
ఎన్నికల నిర్వహణ చూశాక పరాజయం ఊహించామన్నారు. ‘ప్రధాని మోదీ, అమిత్‌షాల మాదిరిగా కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలి. పంజాబ్‌లో నాయకత్వ మార్పు కారణంగా అక్కడి పార్టీలో పూర్తి అయోమయం నెలకొంది. మా ఇన్నింగ్స్ పూర్తిగా ముగింపునకు వచ్చింది. కానీ పార్టీలోని యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. పంజాబ్‌లో నాయకత్వం వ్యవహరించిన తీరును పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం అమరీందర్‌సింగ్‌ను తొలగించిన విధానం, సొంత ప్రభుత్వంపైనే నవజోత్‌సింగ్ సిద్ధూ విమర్శల దాడి కొనసాగిస్తుంటే నాయకత్వం జోక్యం చేసుకోకపోవడాన్ని తప్పుబడుతున్నారు. అయితే నాయకత్వాన్ని రక్షించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధమైనట్లు కనబడుతోంది.
also read;-పంజాబ్ విజయంపై కేజ్రీవాల్‌కు ప్రధాని అభినందన
మనం కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకుంటే.. కొమ్మతోపాటు మనం కూడా పడిపోతామని కొన్ని రాష్ట్రాల ఫలితాలతో వెల్లడైంది. పదవుల కోసం చేసే యుద్ధం తీవ్రరూపం దాల్చి.. మనం కూర్చున్న చెట్టుకే నష్టం కలిగిస్తున్నామో లేదో పార్టీ నేతలు తమను తాము ప్రశ్నించుకోవాలి’ అని ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా చేసిన వ్యాఖ్యల పరమార్థం ఇదేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓటమికి నాయకత్వం బాధ్యత లేదని.. రాష్ట్రాల నేతలు, వారి అంతర్గత పోరే కారణమని.. త్వరలో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించి చేతులు దులుపుకోవాలని అధిష్ఠానం చూస్తోందని చెబుతున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు దురదృష్టకరమని, అయుతే త్వరలోనే పార్టీ ప్రజల విశ్వాసం పొందుతుందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవడం చూశానన్నారు. ఫాసిస్టు శక్తులను ఎదుర్కోగలిగింది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. దీనిపై మరో నేత సల్మాన్‌సోజ్ తీవ్రంగా స్పందించారు.
అలా పుంజుకోవాలంటే కాంగ్రెస్ అందరినీ కలుపుకొని వెళ్లాలని.. మిత్రపక్షాలు అవసరమని సూచించారు.గాంధీలు లేకుంటే..కాంగ్రెస్ మనుగడ అసాధ్యం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌న్యూఢిల్లీ, మార్చి 11: గాంధీ కుటుంబం లేకుంటే కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా ఉండలేదని ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో అధినాయకత్వం మరోమారు విమర్శలపాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధినాయకత్వానికి మద్దతుగా గురువారం డీకే మాట్లాడారు. ‘గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా ఉండలేదు. పార్టీలో ఐక్యతకు వారే కీలకం. గాంధీ కుటుంబం లేకుండా పార్టీ మనుగడ అసాధ్యం’ అన్నారు. గత కొన్నేళ్లుగా అనేకమంది పార్టీని వీడుతున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘పదవుల కోసం ఆత్రంగా ఉన్నవారు దయచేసి పార్టీని వీడి వెళ్లిపోవచ్చు. వ్యక్తిగత లాభం చూసుకునేవారే పార్టీని వీడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రియాంక చాలా శ్రమించారు. అయినా, ఫలితం లేకపోయింది. వాస్తవం ఏమిటంటే ఓటర్లను కాంగ్రెస్ ఒప్పించలేకపోతోంది. ప్రజలకు అర్థం కాలేదు. వారికి వివరించే అవకాశం మాకు వచ్చింది. అందులోనూ మేం విఫలమయ్యాం’ అన్నారు.