ఢిల్లీలో ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష
(హైదరాబాద్-విజయంన్యూస్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ఉద్యోగులకు సంఘీభావంగా దీక్షకు చేపట్టారు.
ఉద్యోగుల పీఆర్‌సీ, ఐఆర్ అంశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టానని వైసీపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉపవాసదీక్ష చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.
also read :-దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆవేదనను బేఖాతరు చేస్తూ జగన్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను విడుదల చేయడంపై ఉద్యోగులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు మద్దతుగా రఘురామ బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాస దీక్ష చేపట్టారు. అధికారుల కమిటీ అనేక సిఫార్సులు చేసినప్పటికీ ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే విధంగా ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామ వ్యతిరేకించారు. మిశ్రా కమిషన్ నివేదికను బహిర్గతం చేయకుండా సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నివేదిక ఆధారంగా చేసినటువంటి పీఆర్సీ సంబంధిత అంశాల ప్రకటనను రఘురామ తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా 30 శాతం ఫిట్‌మెంట్‌తో 1`7`2019 ఆర్థిక ప్రయోజనాలతో ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని రఘురామ డిమాండ్ చేస్తున్నారు.
also read :-థర్డ్ వేవ్ ను అడ్డుకునేందుకు సిద్దంగా ఉన్నాం: మంత్రి
ఉద్యోగులకు జరిగిన అన్యాయానికి మద్దతుగా దీక్ష చేస్తున్నానన్నారు. ఉద్యోగులకు ఎన్నో చేస్తామని ఎన్నికల్లో కూడా వాగ్దానాలు ఇచ్చామని రఘురామ గుర్తు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చెప్పక తప్పదన్నారు. కొంతమంది ఉద్యోగులకు ఇలానే జరగాలని తప్పుగా మాట్లాడుతు న్నారన్నారు. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఏం వస్తుందని… వారు లంచాలు ఎలా తీసుకుంటారని రఘురామ ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అని జగన్ చెప్పారని గుర్తు చేశారు. ప్రజలందరూ ముక్తకంఠంతో ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులుకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించాలని రఘురామ సూచించారు.