Telugu News

2566 వ బుద్ధ జయంతి ఉత్సవంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య

నాగార్జునసాగర్ - విజయం న్యూస్

0

2566 వ బుద్ధ జయంతి ఉత్సవంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య

(నాగార్జునసాగర్ – విజయం న్యూస్)

గౌతమబుద్ధుని 2566 వ జన్మదిన వేడుకల సందర్భంగా లో సోమవారము నాగార్జున సాగర్ లోని బుద్ధ వనం లో నిర్వహించిన కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య పాల్గొని బుద్ధుని వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

also read :-ప్రకృతి కన్నెర్ర… నిండా మునిగిన రైతన్నలు

ఈ సందర్భంగా కామెర్ల జానయ్య మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు తెలిపిన శాంతి అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవడం ద్వారా శాంతి సమాజం ఏర్పడుతుందని అన్నారు. అనంతరం బుద్ధ వనం లోని బుద్ధుని శిల్పాలను తిలకించారు.