Telugu News

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..‌ ?

- హోరాహోరీగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు ?

0

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్..‌ ?

– హోరాహోరీగా కొనసాగుతున్న ఎదురుకాల్పులు ?

( ఛత్తీస్‌గఢ్ – విజయం న్యూస్):-

తెలంగాణకి సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ – సుక్మా జిల్లాల సరిహద్దు అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు సమాచారం. కోబ్రా 210 బెటాలియన్, ఎస్‌టీఎఫ్ సిబ్బంది కలిసి సర్కోగూడ సిల్గర్‌లోని మోకురు అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.