సృష్టికి మూలం.. అమ్మ
—-ప్రేమకు ప్రతి రూపం.. అమ్మ
—-ఆప్యాయత మారుపేరు .. అమ్మ
—-పేగుబంధం .. అమ్మ
—-కడుపుతీపికి మరో రూపం.. అమ్మ
(ఖమ్మం విజయం న్యూస్):-
సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు. నువ్వు కడుపులో పడ్డ అప్పటి నుంచి ఎన్నో బాధలను దిగమింగుతూ.. తన కనురెప్పల మాటున బాధను దాచి పెడుతూ నీకు ప్రేమను పంచుతుంది అమ్మ. నీవు ఎదుగుతున్న కొద్దీ నీ ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో ఆరాట పడుతుంది అమ్మ. అలాంటి అమ్మకు మనం ఏం చేస్తున్నాం? ఏం ఇస్తున్నాం ? ఒక్కసారి ఆలోచించండి. సంపాదన పేరుతో.. మరో కారణం చేతనో.. ఎంతోమంది తల్లులను అనాధాశ్రమంలో వదిలి వెళ్తున్నారు. పేగు బంధానికి మీరిచ్చే గౌరవం ఇదేనా?. చిన్న పిల్లాడి నుండి నిన్ను సాకి ఎంతో ప్రయోజకుల్ని చేసిన తనను ఎక్కడో అనాధాశ్రమంలో అనాధగా, ఒంటరిగా ఆ మాతృమూర్తి వదిలేయడం ఎంతవరకు సమంజసం?
తన ఈ చివరి క్షణాలలో మీ, మీ కుటుంబ సభ్యుల ప్రేమను పంచండి. మీరు మీ పిల్లలకు తల్లిదండ్రులే అని గుర్తుంచుకోండి. కనీసం ఈ ఒక్కరోజు అయిన వారితో సంతోషంగా గడపండి.
చివరగా..
అమ్మా .. నీకు వందనం
హ్యాపీ మదర్స్ డే
పెండ్ర అంజయ్య.. ఎడిటర్.. విజయం తెలుగు దినపత్రిక