Telugu News

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం.

ఆరుగురు సజీవదహనం..35మందికి తీవ్రగాయాలు

0

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం.

== ఆరుగురు సజీవదహనం..35మందికి తీవ్రగాయాలు

== చిలకలూరిపేట- పర్చూరి జాతీయ రహదారి పై ఘటన.*

== తెల్లవారుజామున తెల్లవారిన బతుకులు..*

== బస్సును ఢీకొట్టిన టిప్పర్..*

== బస్సుకు అలుముకున్న మంటలు.. ముగ్గురు సజీవదహనం..డ్రైవర్, చిన్నారి మృతి..మొత్తం ఐదుగురు మృతి..*

== 35మందికి గాయాలు..*

== ఢీకొట్టిన తరువాత మంటలు చెలరేగినట్లు చెబుతున్న స్థానికులు*

== చిలకలూరిపేట ప్రభుత్వ, గుంటూరు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన స్థానికులు..*

== చిన్నగంజ, బాపట్ల కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు..*

== హైదరాబాద్ లో నివాసం ఉంటుండగా ఓటు కోసం స్వంత గ్రామాలకు వచ్చి తిరిగి వెళ్తున్న క్షతగాత్రులు..*

(చిలకలూరిపేట -విజయం న్యూస్)

తెల్లవారుజామున ఆరుగురు జీవితాలు తెల్లారిపోయాయి..ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న ఓటర్లకు నిండు నూరేళ్ళు నిండిపోయి.. టిప్పర్ రూపంలో మృత్యువును కౌగిలించుకుంది.. చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరగ్గా ఆరుగురు సజీవదహనం అయ్యారు.  పూర్తి వివరాలకు వెళ్తే..

చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద ఎదురుగా వస్తున్న డంప్ లారీ ఓ బస్సును ఢీకొట్టింది. అతి తక్కువ సమయంలో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ప్రయాణికుల జాడ ఇంకా లభ్యం కాలేదని సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వచ్చారు ప్రజలు. ఓటు హక్కు వినియోగించుకునే తర్వాత క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాపట్ల ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సు నడుస్తోంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జనగంజాం, గోనసపూడి, నిలయపాలెం గ్రామాలకు చెందిన వారని తెలిసింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబట్ల వారి పాలెం – పసుమర్రు గ్రామాల మధ్య కంకర డంప్ లారీ బస్సును ఢీకొట్టింది. కొద్దిసేపటికే డంప్‌ లారీలో మంటలు చెలరేగగా, అతివేగం కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తారురోడ్డుపై భారీగా మట్టి పేరుకుపోవడం, డంప్‌ లారీ అతివేగంగా వెళ్లడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్నవారంతా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదం జరిగి బస్సులో మంటలు చెలరేగడంతో అందరూ వెంటనే బస్సు దిగేందుకు ప్రయత్నించారు. చాలా మంది స్వల్ప గాయాలతో బయటపడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల్లో బస్సు, , లారీ ట్రక్కు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సబ్బయింది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.