ఐదు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల నగారా
== మధ్యాహ్నం 3.30గంటలకు షెడ్యూల్ విడుదల
== అసక్తిగా చూస్తున్న దేశప్రజలు
(న్యూఢిల్లీ-విజయంన్యూస్)
దేశంలో మరో ఎన్నికలకు ముహుర్తం ఖరారైంది.. అతి కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.. ఒకవైపు కోవిడ్ విజంభిస్తున్న తరుణంలో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ఆలోచనలో ఉన్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సై అంటూ ప్రకటన చేసింది. ఈ మేరకు శనివారం మధ్యహానం 3.30గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది..
also read :-రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించారు: ఏఎస్పీ రోహిత్
== ఎక్కడేక్కడ ఎన్నికలంటే..?
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ ప్రకటించనుంది. ఈ మధ్యాహ్నం 3.30 గంటల మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మే నెలతో పూర్తవుతుంది. ఈ రాష్ట్రాలకు మార్చి-ఏప్రిల్ మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా.. ఉత్తరాఖండ్లో 70, పంజాబ్లో 117, గోవాలో 40, మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికలు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు నాంధీ పలకనున్నాయి..
aalso read :-వనమా రాఘవకు మరో షాక్..
దేశంలోనే అతిప్రతిష్టాత్మక రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా. ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఉత్తరప్రధేశ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, పంజాబ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే పంజాబ్ ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్ ను కూడా కైవసం చేసుకుని క్లిన్ స్వీఫ్ చేయాలనే ఆలోచనలో కేంద్రం అడుగులు వేస్తోంది.. అయితే ఆ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఏఐసీసీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ పూర్తి బాధ్యత తీసుకుని ఎన్నికలకు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రియాంకగాంధీ ప్రధానమంత్రి రేసులో ఉండటం ఖాయం.