Telugu News

గజ్వెల్‌ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి హరీష్‌ రావు

== అందరు మాస్క్ ధరించడమే సరైన మందు

0

గజ్వెల్‌ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి హరీష్‌ రావు
== అందరు మాస్క్ ధరించడమే సరైన మందు
(సిద్దిపేట-విజయంన్యూస్)
కరోనా మహమ్మారి రోజురోజుకు విజంభిస్తున్న తరుణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ ఆసుపత్రిని బుధవారం అకస్మీకంగా పరిశీలించారు. వైద్య సదుపాయాల గురించి రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్యసౌకర్యాలు, రోగుల పరిస్థితి, కరోనా కేసుల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు.

ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఒమైక్రాన్‌తో ప్రజలు ఆందోళన చెందొద్దని అన్నారు. జాగ్రత్తలే అసలు సిసలు మందు అని అని, ప్రజలు జాగ్రత్తగా ఉన్నంతకాలం ఎలాంటి వైరసులనైనా జయించవచ్చని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రిలో కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2 కోట్ల కరోన పరీక్షల కిట్లు, కోటి హోమ్‌ ఐసోలేషన్‌ కిట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. రాష్ట్రంలో అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కరోన చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.గజ్వేల్‌ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు భేష్‌గా ఉన్నాయన్నారు.

also read ;-ఢిల్లీలో ఎంపీ రఘురామ ఉపవాస దీక్ష

ఐసోలేషన్‌ కోసం సిద్దిపేటలో ఆక్సిజన్‌ సౌకర్యంతో వంద పడకల ఆస్పత్రి ఉందని చెప్పారు.సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వైద్య ఆరోగ్య శాఖ సంసిద్ధంగా ఉందని హరీష్‌రావు పేర్కొన్నారు. కోవిడ్‌ రోగులకు అందుతున్న వైద్య సేవల పట్ల ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్‌ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ ఆస్పత్రిలో నెలకు 400 డెలవరీలు చేస్తున్నామని, ఒక రూపాయి ఖర్చు లేకుండా కెసిఆర్‌ కిట్‌ ద్వారా అందజేస్తున్నామని, ప్రభుత్వాస్పత్రిలో కాన్పుల సంఖ్య 22 శాతం పెంచామని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఎస్‌ఎన్‌ సియు వార్డు ఏర్పాటు చేసి కామెర్లు వచ్చిన చిన్న పిల్లలకు చికిత్స అందిస్తున్నా మన్నారు. గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది సేవలను కొనియాడారు. ఆడపిల్ల జన్మిస్తే 13 వేలు, మగపిల్లవాడు జన్మిస్తే 12 వేల రూపాయలు కెసిఆర్‌ కిట్‌ ద్వారా ఇస్తున్నామన్నారు.
“`