ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
—బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్
—-ఉమ్మడి ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ పుల్లూరు నాగయ్య
(ఖమ్మం-విజయం న్యూస్);-
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న గ్రహిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఖమ్మం జిల్లాలో ఘనంగానిర్వహిండం జరిగింది. ముందుగ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి పుల్లూరు నాగయ్య, ఆధ్వర్యం లోఖమ్మం జిల్లా కన్వీనర్ కోటేశ్వరరావు కోకన్వీనర్ దత్తు కిషోర అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
also read :-రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారు
ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ పుల్లూరు నాగయ్య మాట్లాడుతూ భారత రత్న గ్రహిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన శేష జీవితాన్ని దళిత సమాజం పునరుద్ధరణకు అంకితం చేశారని కొనియాడారు. అంటరాని తనాన్ని రూపుమాపడానికి ఆయన చేసిన కృషి ఎనలేదని అన్నారు. కులవ్యవస్థ నిర్మూలణకు తన గ్రంథాలతో ఎంతో ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేశారని అన్నారు. ఆధునిక భారత దేశంలో రాజకీయ విప్లవం కోసమే కాకుండా సామాజిక విప్లవం కోసం పోరాటం చేసిన గొప్ప దూరదృష్టి కలిగిన యోధుడని స్మరించుకున్నారు.
also read ;-ఏసు శాంతి సందేశాన్ని పాటించాలి
దళిత వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. బ్రిటీష్ వలస పాలన కాలంలో ప్రధానంగా ఆయన అణగారిన దళిత అస్పృశ్య ప్రజానీకం పరిస్థితులు, సామాజిక అణచివేత వివక్ష తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారంకోసం అటు బ్రిటీష్ ప్రభుత్వంతోనూ ఇటు దేశ పెత్తందార్లతోనూ సైద్ధాంతిక భావజాల పరంగా భౌతికంగా ద్విముఖ పోరాటాలు చేసిన మహనీయుడని వారు గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను స్పూర్తిగా తీసుకోని నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ కన్వీనర్ దరిపల్లి మహేష్, రఘునాధపాలెం మండలం కన్వీనర్ నరేష్ ,పాలేరు నియోజకవర్గ కొండ శ్రీనివాస్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.