ఘనంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
(బెల్లంపల్లి – విజయం న్యూస్)
బెల్లంపల్లి నియోజకవర్గం వైయస్సార్ తెలంగాణ పార్టీ ఇంచార్జి కాశి సతీష్ కుమార్, మహిళా జిల్లా అధ్యక్షులు జాగటి కల్పనా ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాత్రంత్రం కోసం, సామాజిక సమానత్వం కోసం, అనగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని పేర్కొన్నారు.
also read;-బీజేపీ కార్యకర్తలకు కాషాయ టోపీ
వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాజీద్, రాజేశ్వరి, కవిరాజ్, సురేష్, సద్విక్, తులసి, అనూష, రాధ తదితరులు పాల్గొన్నారు.