Telugu News

అటవీ హక్కు చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం

గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్

0

అటవీ హక్కు చట్టాలను ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం

(గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్):-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కు చట్టాలను పూర్తీగా ఉల్లంఘిస్తుందని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలములో మొండ్యల తోగు గోతికోయాగుడెం, ను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెంకట్ రెడ్డి సందర్శించారు.

also read :-ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా శోభన్ బాబు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామానికి చెందిన కొందరు రైతులు పట్టాలకు ధరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం దరఖాస్తులు పరిశీలించకుండా పెండింగ్ లో పెట్టి అటవీశాఖ అధికారులతో గిరిజన రైతుల భూముల చుట్టూ కందకాలు తవ్విస్తున్నరని అన్నారు. కందకాల తవ్వకాలు ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.