Telugu News

.ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్‌ జన్మదిన వేడుకలు.

విజయం న్యూస్

0

ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్‌ జన్మదిన వేడుకలు.

(కూసుమంచి విజయం న్యూస్):-

కూసుమంచి మండల పరిధిలోని జక్కేపల్లి ఎస్సీ కాలనీ గ్రామపంచాయతీ లోకులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ అని సర్పంచ్ రాయబారపు స్వాతి రమేష్ కొనియాడారు.

also read;-ముస్లిం మైనార్టీ సమాజం పై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న మంత్రి అజయ్

దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత అన్నారు. ఏప్రిల్ 05, 2022వ తేదీ జగ్జీవన్‌రామ్‌ 115వ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవల్ని మనమంతా స్మరించుకొని ఘనంగా నివాళులు అర్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయబారపు స్వాతి రమేష్, ఎంపీటీసీ కందుల వెంకటనారాయణ, ఉప సర్పంచి తంగెళ్ల ఉమా, వార్డు నెంబర్స్ పులిపాటి సత్యవతి, కో ఆప్షన్ సభ్యులు యాకోబు, గ్రామస్తులు, అప్పదాసు, నరసింహారావు, మేరా సాహెబ్, కిషోర్, ఆదామ్ బి ,గురవమ్మ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.