ఇక జగన్‌కు విశాఖ ఉక్కు సెగ
== రాజధానిని తరలిస్తే మరింత ఉధృతంగా పోరాటం
== ఇక నిరంతరంగా పోరాటాలకు అవకాశం
విశాఖపట్టణం,మార్చి10(ఆర్‌ఎన్‌ఎ):
విశాఖకు రాజధానిని మారుస్తానని, త్వరలోనే తన నివాసం కూడా విశాఖే అని చెబుతున్న సిఎం జగన్ ఇక వివృాక ఉక్కు ఆందోళనలను ప్రత్యక్షంగా ఎదుర్కోక తప్పదు. ఆరునూరైనా విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మేస్తామన్న కేంద్రం ప్రకటనతో ఇప్పటికే విశాఖ ప్రజలు,కార్మిక సంఘాలు,రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. మా ప్రాణాలైనా అర్పిస్తాం.. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కానివ్వబోం.. అంటూ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం కుండ బద్ధలు కొట్టేసింది.
ఇది కూడా చదవండి: దేశ మహిళా లోకానికి మేల్కొలుపు
ఏ మాత్రం అనుమానాల్లేకుండా ప్లాంట్ ప్రైవేటీకరణ తథ్యమని ప్రకటించింది. ప్లాంట్ కేంద్రానిదని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం లేదంటూ అనవసర జోక్యం ఆపాలన్నట్టుగా చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలో జగన్ బస ఇక విశాఖకు మారితే ఉక్కు ఫ్యాక్టరీపై వైఖరి ఎలా ఉంటుందో చెప్పాల్సి ఉంటుంది. నిరంతర ఆందోళనలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అమరావతిని అణచివేసినట్లు విశాఖ ఆందోళనలను అణివేయాలనుకుంటే మొదటికే ముప్పు రాగలదు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖసాగర తీరం నిత్యం హోరెత్తుతోంది. వైజాగ్ స్టీల్ పరిరక్షణ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. వైజాగ్ స్టీల్ పరిరక్షణ నినాదాలరతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. ప్రధాని మోడీ డౌన్ డౌన్ అంటూ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిరంతరంగగా సాగుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. కేంద్రం తీరుకు నిరసనగా నిరంతర ఆందోళనలకు ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది.
ఇది కూడా చదవండి: సిపిఆర్- ప్రాణం పోసే ప్రక్రియ:గిరిసింహ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు పోరాడుతున్నా వెనక్కి తగ్గకపోవడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శమన్నారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి బిజెపిని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, బంద్‌లు జరుగుతుంటే కేంద్రానికి అర్థం కావడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. మొత్తంగా కార్మిక సంఘాల నిరసనలతో స్టీల్ సిటీ భగ్గుమంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గూడుపుఠాని బయట పడడంతో మోదీ, జగన్ తీరును ఎండగడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అక్కడ మద్దతు ఇస్తూనే మరోవైపు నిరసనలకు సంబంధించి పిలుపు కూడా ఇస్తోంది. విశాఖ ఉక్కులో కేంద్ర ఈక్విటీని ఉపసంహరించుకోవడం వల్ల పెద్దఎత్తున పెట్టుబడులు ప్రవేశిస్తాయని, విస్తరణకు, సామర్థ్యం పెంపునకు, అధునాతన టెక్నాలజీ ప్రవేశపెట్టడం, మెరుగైన యాజమాన్య పద్ధతులను అవలంబించ వచ్చని చేస్తున్న ప్రకటనలు కార్మికులను ఊరడిరచడం లేదు. దీనివల్ల ఉత్పాదకత పెరగడమే కాక.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగు తాయని నమ్మబలుకుతున్నారు. అమ్మకం కోసం నియమ నిబంధనలను ఖరారు చేసే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, వాటాదారులకు ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరిస్తామని.. అందుకు అనుగుణంగా వాటాల కొనుగోలు ఒప్పందంలో తగిన అంశాలను చేరుస్తామని స్పష్టం చేశారు. అయితే ఇంతకాలంగా కొనసాగుతున్న ఉక్కు ఉద్యమ సెగ ఇప్పుడు ఇక జగన్‌కు నేరుగా తాకనుందనడంలో సందేహం లేదు.
ఇదికూడా చదవండి: బీఆర్ఎస్ సమావేశం ముఖ్యాంశాలు ఇవే