Telugu News

మేలుకుంటే కోలుకుంటాం

విజయం న్యూస్

0

మేలుకుంటే కోలుకుంటాం.
==ప్రతి ఒక్కరూ చివరి వరకూ చదవాల్సిన/తగిన చర్యలకై వ్యక్తిగతంగా స్పందించాల్సిన అంశమిది.
==మన పట్టణ ప్రాంతాల 87.7 శాతం వాసులకు పొంచివున్న ప్రమాదం గ్లోబల్ వార్మింగ్ తో అత్యంత తీవ్రమైన ==వాతావరణ ప్రమాదాలు: IPCC నివేదిక హెచ్చరిక
•ప్రమాదకర నగరాల్లో లక్నో, పాట్నా

(విజయం న్యూస్):-
నూయార్క్‌ : గ్లోబల్‌ వార్మింగ్‌ రానున్న రెండు దశాబ్దాల్లో ప్రపంచంపై పెను ప్రభావాన్ని చూపిస్తుందని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) సోమవారం విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది. 1.5 డిగ్రీల సెల్సియస్‌ గ్లోబల్‌ వార్మింగ్‌తో రాబోయే రెండు దశాబ్దాల్లో అనివార్యమైన విపరీతమైన వాతావరణ ప్రమాదాలను ప్రపంచం ఎదుర్కుంటుందని, ఈ స్థాయిని అధిగమించడం వల్ల అదనపు, తీవ్రమైన ప్రభావాలతో పాటు కొన్ని కోలుకోలేనివిగా ఉంటాయని నివేదిక తెలిపింది. వాస్తవానికి 2021 సెప్టెంబరులో విడుదల కావాల్సిన ఈ నివేదిక కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది.

also read :-మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ను పరామర్శించనున్న సీఎం కేసీఆర్

వాతావరణ-సంబంధిత విపత్తులపై గత అంచనాల ఆధారంగా ఈ నివేదిక రూపొందిచబడింది. ‘ఈ నివేదిక నిష్క్రియాత్మక పరిణామాల గురించి భయంకరమైన హెచ్చరిక’ ఐపిసిసి చైర్‌ హోసంగ్‌ లీ తెలిపారు. ‘వాతావరణ మార్పు మన మంచిగా ఉన్న, ఆరోగ్యకరమైన గ్రహానికి తీవ్రమైన, పెరుగుతున్న ముప్పు అని నివేదిక చూపిస్తుంది. తీవ్రమైన వాతావరణ ప్రమాదాలకు ప్రకృతి ఎలా ప్రతిస్పందిస్తుందో, ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో ప్రస్తుత మన చర్యలు తెలియచేస్తాయి’ అని చెప్పారు.

మానవ-ప్రేరిత వాతావరణ మార్పులతో మరింత తరచుగా, తీవ్రమైన విపరీత సంఘటనలతో సహా, సహజ వాతావరణ వైవిధ్యానికి మించి, ప్రకృతికి- ప్రజలకు విస్తృతమైన ప్రతికూల ప్రభావాలు, నష్టాలు కలిగాయని నివేదిక తెలిపింది. కొన్ని అభివృద్ధి, అనుసరణ ప్రయత్నాలు హానిని తగ్గించాయని అయితే కొన్ని ప్రాంతాల్లో వ్యక్తులు, వ్యవస్థలు అసమానంగా ప్రభావితమవుతున్నాయని నివేదిక తెలిపింది. భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్న ఈ నివేదిక ప్రకటన ప్రకారం తీవ్రమైన వాతావరణ మార్పులు ప్రకృతి సహజ సామర్థ్యానికి మించి ఉండటం వల్ల కొన్ని కోలుకోలేని ప్రభావాలకు దారితీశాయి.

also read :-బాల రత్న” జాతీయ పురస్కారం 2022కు ఎంపికైన తనిష్క

2070 నాటికి భారతదేశం జీరో ఉద్గారాలను సాధిస్తుందని, అంటే నికర కర్బన ఉద్గారాలు ఉండవని గతేడాది గ్లాస్గోలో జరిగిన కాప్‌ 26 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. 2030 నాటికి భారతదేశం తన విద్యుత్‌లో 50 శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల నుండి పొందేలా చూస్తుందని, 2030 వరకు కర్బన ఉద్గారాలను ఒక బిలియన్‌ టన్నులు తగ్గిస్తుందని, జిడిపిలో ఒక యూనిట్‌కు దాని ఉద్గారాల తీవ్రతను 45 శాతం కంటే తక్కువగా తగ్గిస్తుందని మోడీ హామీ ఇచ్చారు. అలాగే 2030 నాటికి భారత్‌ 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని వ్యవస్థాపిస్తుందని కూడా చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని నివేదిక తెలిపింది.నివేదికలో ఉదహరించిన అనేక అధ్యయనాల్లో లక్నో, పాట్నాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలో కొనసాగితే, ఇక్కడ ఉష్ణ్నోగత 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చనని నివేదిక అంచనా వేసింది. అలాగే, భువనేశ్వర్‌, చెన్నై, ముంబై, ఇండోర్‌, అహ్మదాబాద్‌లో ఉష్ణోగ్రతలు 32-34 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుకునే ప్రమాదం ఉన్నట్లు గుర్తించబడ్డాయి. మొత్తమ్మీద, అస్సాం, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ చాలా తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఉద్గారాల పెరుగుదల ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని నివేదిక అంచనా వేసింది. వివిధ దేశాల్లో ప్రభుత్వాలు తమ ఉద్గారాల తగ్గింపు వాగ్దానాలను అమలు చేస్తేనే ప్రపంచ సముద్ర మట్టాలు ఈ శతాబ్దంలో 44-76 సెంటీమీటర్లు వరకూ పెరుగుతాయి.

also read :-తిరుమలను దర్శించుకున్న ఎమ్మెల్సీ తాతామధు

వేగవంతమైన ఉద్గార తగ్గింపుతో పెరుగుదల 28-55 సెంటీమీటర్లుకు పరిమితం చేయచ్చు. కానీ అధిక ఉద్గారాలతో, మంచు పలకలు ఊహించిన దానికంటే త్వరగా కూలిపోతే, సముద్ర మట్టాలు ఈ శతాబ్దంలో 2 మీటర్ల వరకు, 2150 నాటికి 5 మీటర్ల వరకు పెరగొచ్చు. ‘2050 నాటికి మన భూమి 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని అంచనా. సున్నితంగా ఉండే పర్యావరణ శాస్త్రం కారణంగా వాతావరణంలో స్వల్ప మార్పు కూడా హిమాలయ ప్రాంతంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది.

ఈ సంవత్సరం హిమాచల్‌, ఉత్తరాఖండ్‌లో మేము చూసిన చమోలీ విపత్తు, భారీ వర్షపాతం వంటి విపరీత వాతావరణ సంఘటనలు వంటి సంఘటనలు మరింతగా పెరుగుతాయి’ అని భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌ డైరెక్టర్‌, ఈ నివేదిక ప్రధాన రచయిత అంజల్‌ ప్రకాష్‌ తెలిపారు. తీవ్రమైన గ్లోబల్‌ వార్మింగ్‌తో మూడు ప్రధాన సమస్యలు ఉంటాయని కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌ (సిఇఇడబ్ల్యూ) సిఇఒ అరుణాభా ఘోష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మొదటిది వేగవంతమైన వాతావరణ సంక్షోభంతో నీటి ఎద్దడి, నీటి వ్యాధులు సంభవిస్తాయని, రెండోది వాతావరణ మార్పులతో ఆహారోత్పత్తి, ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. మూడోది కరువులు, వేడి గాలులు జీవవైవిధ్య నష్టాన్ని, అలాగే మానవ వలసలను ప్రేరేపిస్తాయని తెలిపారు.

Carbon Emissions: తీవ్రమైన వేడి తప్పదు!: ఐరాస

కార్బన్‌ ఉద్గారాలను భారత్‌ తగ్గించాలి..లేదంటే
ఆహార దిగుబడులూ పడిపోతాయి..
పర్యావరణ ముప్పు తీవ్రరూపం దాల్చుతోంది : ఐరాస నివేదిక
న్యూయార్క్‌ : కార్బన్‌ ఉద్గారాలు ఇదేవిధంగా ఉంటే..భారత్‌లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు దారితీస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భూతాపాన్ని (వాతావరణం వేడెక్కటం) అడ్డుకోకపోతే ముందు ముందు పరిణామాలు దారుణంగా ఉంటాయని, తిరిగి పూర్వపు పరిస్థితులకు వెళ్లటం అసాధ్యమని తాజా నివేదికలో ఐరాస పేర్కొన్నది. ఐక్యరాజ్యసమితిలోని ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ తాజా నివేదికలో పై విషయాలు పేర్కొన్నారు. దాంట్లో భారత్‌కు సంబంధించి మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

also read :-పెట్రోల్ ట్యాంకర్ బోల్తా…

కార్బన్‌ ఉద్గారాల్ని భారత్‌ అడ్డుకోకపోతే, వాతావరణంలో అత్యధిక ఉష్ణం, తేమ నెలకొంటుంది. వాతావరణం ప్రజలు భరించశక్యం కానంత స్థాయికి చేరుకుంటుంది. అంతేగాక, ఆహార ఉత్పత్తుల దిగుబడిని భారీఎత్తున తగ్గిస్తుందని నివేదిక తెలిపింది. ఒక్క డిగ్రీ సెల్సీయస్‌ నుంచి నాలుగు డిగ్రీల సెల్సీయస్‌ పెరిగితే, భారత్‌లో వరి దిగుబడి 10 శాతం నుంచి 30శాతం వరకు, మొక్కజొన్న 25శాతం నుంచి 70శాతం వరకు తగ్గుతుందని నివేదిక అంచనావేసింది.

మొత్తం జీవరాశిపై ప్రభావం
రాబోయే రెండు దశాబ్దాల్లో భూమిపై ఉష్ణోగ్రతలు 1.5 సెల్సీయస్‌ పెరగనున్నది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి. స్వల్పకాలికంగానూ తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడతాయి. వీటిని మార్చలేం. తాత్కాలికంగా వచ్చే మార్పులు కొనసాగుతాయి. ఇదంతా కూడా ప్రపంచ మానవాళిపై, జంతువులపై, మొత్తం జీవరాశిపై ప్రభావం చూపుతుంది. పర్యావరణంలో వచ్చే అనూహ్యమైన మార్పులు ఈ జీవరాశి ఎదుర్కోవాల్సి వుంటుంది. ఉదాహరణకు 2010-20 మధ్యకాలంలో భారీ వర్షాలు, వరదలు, కరువులు, తుఫాన్ల కారణంగా మరణాల సంఖ్య 15రెట్లు పెరిగింది. ఆఫ్రికా, దక్షిణాసియా, దక్షిణ, మధ్య అమెరికాలో మరణాలరేటు ఎక్కువగా ఉంది.

”ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలు, పనిప్రదేశాలు మారిపోతాయి. ఇతర జంతుజీవజాలంతో కలిసి మనిషి ఈ ప్రపంచంలో బతుకుతున్నాడు. దీనిని పర్యావరణ మార్పులు అల్లకల్లోలం చేస్తాయి” అని నివేదిక రూపకల్పనలో పాల్గొన్న డెబ్రా రాబర్ట్స్‌ అనాురు. భారత్‌ విషయానికొస్తే, కోస్తాతీర ప్రాంతాల్లో 3.5కోట్ల మందిపై ప్రభావం పడుతుంది. కార్బన్‌ ఉద్గారాలు ఇదే విధంగా పెరుగుతూ పోతుంటే..భూమి వేగంగా వేడెక్కుతుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే 87.7కోట్లమందికి ప్రమాదం పొంచివుందని రచయిత అంజల్‌ ప్రకాశ్‌ చెప్పారు. జనాభా ఎక్కువగా ఉను నగరాలపై పర్యావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని అన్నారు.