దమ్మపేట మండల కేంద్రంలొ ఇఫ్తార్ విందు
(అశ్వారావుపేట/దమ్మపేట విజయం న్యూస్);-
దమ్మపేట మండల కేంద్రం లొని మస్జిద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసారు.ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొనిమస్జిద్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు .అనంతరం రోజా ఉన్న సోదరులకు ఉపవాస దీక్షను విరమింపచేసారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ పండుగను అందరూ సుఖ సంతోషాలతో,ఆనందోత్సు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
also read :-అభివృద్ధి పనులపై ప్రభుత్వ విప్ ను స్వయంగా కలిసిన అంబేద్కర్ కాలనీ వాసులు
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున రావు,పోతినేని వెంకట్ రావు,ఎల్ఎస్సిఎస్ చైర్మన్ రావు జోగుబాబు,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కెవి, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్,టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, బుడే, మండల యువజన అధ్యక్షులు గోపి శాస్త్రి,అబ్దుల్ జిన్నా, పానుగంటి చిట్టిబాబు,కవులురీ నాగయ్య,కోటి,ప్రసాద్,బండ్ల లక్ష్మయ్య, బెక్కం వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు