Telugu News

నేడు ఇండియా-దక్షణాఫ్రిక  పైనల్ వన్డే మ్యాచ్

1-1 పాయింట్లతో సమంగా ఉన్న ఇరు జట్లు

0

నేడు ఇండియా-దక్షణాఫ్రిక  పైనల్ వన్డే మ్యాచ్

== 1-1 పాయింట్లతో సమంగా ఉన్న ఇరు జట్లు

== నేటి మ్యాచ్ విన్నింగ్ తో సీరిస్ కైవసం

== టాస్ పై ఆధారపడిన విజయం

(క్రీడావిభాగం-విజయంన్యూస్)

ఇండియా వర్సెస్ దక్షణాప్రిక వన్డే మ్యాచ్ మంగళవారం ప్రారంభం కానుంది. మరికొద్ది నిమిషాలలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ అభిమానులకు టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే మూడు వన్డేల సీరిస్ లో 1-1 తో సమం పాయింట్లతో పోటాపోటీగా ఉన్న ఇరుజట్లు సీరిస్ ను ఎగరేసుకపోయేందుకు నేడు పోటీ పడుతున్నాయి. మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభమైయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇది పైనల్ మ్యాచ్ కావడంతో ఇరు జట్లు కూడా గట్టి పటిష్టమైన బౌలింగ్, బ్యాంటింగ్ అర్డర్ తో విజయం కోసం సిద్దమైయ్యాయి. ఇప్పటికే ఇరు జట్ల బ్యాటింగ్ లైనఫ్ అద్భుతంగా ఉంది. ఇద్దరు బ్యాట్స్ మెన్ల బాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయాలను అందిస్తున్న పరిస్థితి ఉంది. భారత్ జట్టులో మొత్తం యువకులు, కొత్తవారైనప్పటికి అద్భుతంగా రాణిస్తున్నారు. కొంత బౌలింగ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నప్పటికి బ్యాటింగ్ విషయంలో కొంత పర్వాలేదనుకుంటూనే అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే కచ్చితంగా ఈ రోజు టాస్ పైనే విజయం అధారపడి ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి బ్యాటింగ్ తీసుకున్నవారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని అంటున్నారు. చూద్దాం ఈ రోజు జరిగే మ్యాచ్ ఎవర్ని గెలిపిస్తుందో..?

ALLSO READ- హామీలు తప్పా అమలు కానీ కేసిఆర్ మాటలు:సీతక్క