Telugu News

మహిళల ప్రపంచకప్‌లో రేపే కీలక టెస్ట్‌

విండీస్ తో తలపడనున్న ఇండియా

0

మహిళల ప్రపంచకప్‌లో రేపే కీలక టెస్ట్‌
== విండీస్ తో తలపడనున్న ఇండియా
(న్యూఢల్లీ-విజయంన్యూస్):-
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ లో శనివారం వెస్టిండీస్‌ తో జరుగుతున్న మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తమ బ్యాట్స్‌మెన్‌ నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. పాకిస్థాన్‌పై అద్భుత ఆరంభం తర్వాత, పేలవమైన బ్యాటింగ్‌ కారణంగా న్యూజిలాండ్‌పై టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్‌ చేతిలో 62 పరుగుల తేడాతో పరాజయం పాలైన తర్వాత, ఐదో స్థానంలో ఉన్న మిథాలీ రాజ్‌ కెప్టెన్సీలోని భారత జట్టు బౌన్సీ పిచ్‌పై వరుస పరాజయాలు తమ జోరును దెబ్బతీస్తాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన, మిథాలీ రాజ్‌, యాస్తిక భాటియా, ఆల్‌ రౌండర్‌ దీప్తి శర్మలు పేలవంగా ఆడారంటూ విమర్శలు కూడా వచ్చాయి.

also read :-ఆర్య వైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తా

261 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 62 బంతుల్లో 71 పరుగులు చేసింది. కౌర్‌ తప్ప ఎవరూ పరుగులు చేయలేకపోయారు. అస్థిరమైన ఫామ్‌ ఉన్నప్పటికీ, ప్లేయింగ్‌ చీఎకి షెఫాలీ వర్మ తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మునుపటి మ్యాచ్‌లో యాష్తిక కూడా ఆకట్టుకోకపోవడంతో షెఫాలీ వర్మకు మరలా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. భారత బ్యాట్స్‌మెన్‌ 162 డాట్‌ బాల్స్‌ ఆడడం అంటే దాదాపు 27 ఓవర్లు పరుగులు చేయలేదు. తొలి 20 ఓవర్లలో ఆ జట్టు 50 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టు ప్రదర్శనపై ప్రధాన కోచ్‌ రమేష్‌ పవార్‌ తీవ్ర విమర్శలు చేశారు.

also read :-పాలేరు కారు పార్టీలో కలవరం

ప్రస్తుతం స్టెఫానీ టేలర్‌, డియాండ్రా డాటిన్‌, అనిస్సా మహ్మద్‌ వంటి ఆటగాళ్లు ముందున్నారు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన గత ఆరు మ్యాచ్‌లలో మా ప్రదర్శనను పరిశీలిస్తే, మేం మా వ్యూహాన్ని చాలా బాగా అమలు చేసాం’ అని తెలిపాడు. తన చివరి టోర్నీ ఆడుతున్న మిథాలీ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతుండగా, మంధాన కూడా అలానే ఉంది. దీంతో పూజా వస్త్రాకర్‌, స్నేహ రానాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతోంది. సీనియర్‌ ఆటగాళ్లు మరింత బాధ్యతాయుతంగా ఆడాలని కోచ్‌ పవార్‌ స్పష్టంగా పేర్కొన్నాడు. టోర్నమెంట్‌లో వెస్టిండీస్‌కు మంచి ఆరంభం లభించింది.

కెప్టెన్‌ టేలర్‌ జోరును కొనసాగించాలనుకుంటుంది. గత మ్యాచ్‌లో డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. టేలర్‌కి బౌలింగ్‌ చేయడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా, ఆమె ఎనిమిది మంది బౌలర్లను ప్రయత్నించింది. షామిలియా కానెల్‌, షకీరా సల్మాన్‌, చినెª`లలె హెన్రీ, అనిస్సా వంటి బౌలర్లు వెస్టిండీస్‌ జట్టులో ఉన్నారు. కాబట్టి భారత్‌కు మూడో పోరు అంత సులభం కాదు.