Telugu News

థర్డ్ వేవ్ ను అడ్డుకునేందుకు సిద్దంగా ఉన్నాం: మంత్రి

★ ఒమిక్రాన్‌ వ్యాప్తి నివారణకు పకడ్బందీ 

0

థర్డ్ వేవ్ ను అడ్డుకునేందుకు సిద్దంగా ఉన్నాం: మంత్రి

★ ఒమిక్రాన్‌ వ్యాప్తి నివారణకు పకడ్బందీ 

    చర్యలు

★ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్‌

★ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు

★ కరోనా నివారణ చర్యలపై అధికారులతో

    మంత్రి సమీక్ష

కరోనా, ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ నివారణ చర్యలు, ఆక్సీజన్‌ నిల్వలు, పడకలు, ఔషధాలు తదితర అంశాలపై బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నందు అధికారులతో మంత్రి అజయ్ సమీక్షించారు.

also read :-ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి :-మొక్క శేఖర్ గౌడ్

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ…

రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయని, అధికారులు ముందస్తు చర్యలతో సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రితోపాటు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో అందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నందున ప్రజలు మరోసారి స్వీయ రక్షణ పాటించాలని, అర్హులందరూ తప్పకుండా టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేయకుండా యాజమాన్యాలతో చర్చించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లా ఆస్పత్రి కమిటీ సమావేశం ప్రతీ నెలా నిర్వహించాలని మంత్రి

also read :-ఎమ్మెల్యే శంకర్ నాయక్ కె కరోనా పాజిటివ్

 అజయ్ కుమార్ సూచించారు. 

వ్యాక్సినేషన్‌ రెండో డోసు ఈ నెలాఖరు లోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. రెండు డోసులు పూర్తయిన వారు నిర్ణీత గడువు తర్వాత బూస్టర్‌ డోసు వేసుకోవాలన్నారు. పండుగ సీజన్‌లో అనేక మంది వివిధ ప్రాంతాలకు వెళ్లొచ్చారని, వారి వల్ల కొవిడ్‌ వ్యాప్తి చెందుతున్నదని కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో హోం ఐసోలేషన్‌ కిట్స్‌ అందించాలన్నారు.