Telugu News

దేశానికి సేవ చేయడం నా అదృష్టం.

పోరుబందరు లో పెట్టిఆఫీసర్ గా పదోన్నతి పొందిన కల్లూరు మండల వాసి పరిమి భరత్

0

దేశానికి సేవ చేయడం నా అదృష్టం.
పోరుబందరు లో పెట్టిఆఫీసర్ గా పదోన్నతి పొందిన కల్లూరు మండల వాసి పరిమి భరత్

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరు వంచ గ్రామానికి చెందిన పరిమి భరత్ కేరళ రాష్ట్రంలో నావి కోచ్చిలో శిక్షణ అనంతరం పెట్టీ ఆఫీసర్ గా పదోన్నతి పొంది గుజరాత్ రాష్ట్రంలో ని పోరుబందర్ కి సేవలు అందించనున్నారు.

ఈ సందర్భంగా పరిమి భరత్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి సమాజంపై,దేశంపై ఉన్న ప్రేమ, నాకు నా కుటుంబ సభ్యులు,నా గ్రామ ప్రజల, అదికారుల ఆశీస్సులతో నేను పదోన్నతి పొందడం సంతోషంగా ఉందని అన్నారు.ఇకపై ఇంకా బాధ్యతగా పనిచేసి మనదేశానికి,మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తానని అన్నారు.దేశానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.అనంతరం జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు పరిమి భారత్ ని అభినందించారు.

also read :- కాంగ్రెస్ గూటికి జిట్టా బాలకృష్ణ రెడ్డి…?