నవజ్యోతిసిద్దూకు జైలు శిక్ష్
== ఏడాది పాటు జైలు శిక్ష విధించిన సుఫ్రీంకోర్టు
(పంజాబ్-విజయం న్యూస్);-
మాజీ క్రికెటర్, పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు సుఫ్రీం కోర్టు షాక్ ఇచ్చింది.. ఓ రోడ్డు ప్రమాదం కేసులో ఆయనకు ఏడాదిపాటు జైలు శిక్ష విదిస్తూ సుఫ్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 1988లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మరణించగా, కొంత మంది గాయపడ్డారు. ఆ సమయంలో జరిగిన గొడవలో నవజ్యోతి సింగ్ సిద్ధూ వారిని అడ్డుకోవడంతో పాటు ఆసుపత్రికి వెళ్లకుండా కారు తాళ్లాలు లాక్కోవడంతో బాలుడు చనిపోయాడని బాధితులు ఆరోపిస్తూ స్థానిక కోర్టును అశ్రయించారు.
also read :-నేరాల నిర్మూలనకై, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
కాగా స్థానిక కోర్టు సిద్ధూకు అనుకూలంగా తీర్పు రాగా 2006లో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అక్కడ సరైన నిర్ణయం రాకపోవడంతో బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణకు అవకాశం కల్పించిన సుఫ్రీంకోర్టు గత 9నెలల నుంచి పలు సాక్ష్యాలను విచారణ చేస్తు గురువారం తీర్పు ప్రకటించింది. నవజ్యోతి సింగ్ సిద్ధూ బాధ్యుడిగా గుర్తించిన సుఫ్రీంకోర్టు ఏడాది పాటు జైలు శిక్ష ఖరారు చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో సిద్దూ అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. అభిమానుల్లో గందరగోళం నేలకొంది.