Telugu News

నేడు కొలువుదీరనున్న కర్ణాటక ప్రభుత్వం

సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణం

0

నేడు కొలువుదీరనున్న కర్ణాటక ప్రభుత్వం

== సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే ప్రమాణం

== మరికొంత మంది మంత్రులతో ప్రమాణం చేయించనున్న గవర్నర్

== భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు

(బెంగుళూరు-విజయంన్యూస్)

మరికొద్ది గంటల్లో కర్ణాటక కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరికొంత మంది మంత్రులతో శనివారం మధ్యాహ్నం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వాధికారులు, ప్రగతిభవన్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవలే కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఈనెల 13న ఫలితాలు వచ్చాయి. ముందుగా బీజేపీ, కాంగ్రెస్ నడుమ హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా విజయంసాధించింది.

ఇది కూడా చదవండి: యువతా మేలుకో… రాజ్యాన్ని ఏలుకో: పొంగులేటి 

135 స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో కర్ణాటక ప్రగతిభవన్ పై జెండా ఎగరేయనుంది. అయితే కొత్త సీఎం ఎవరనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుళ్లాలు పడింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అధిష్టానం కూడా ఎటు తెల్చాలో అర్థం కాలేదు. దీంతో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మూడు రోజుల పాటు ఏం జరుగుతుందని అందరు భావించారు. అయితే  నేరుగా సోనియాగాంధీ రంగంలోకి దిగి సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో చర్చించారు. చివరికి సిద్దరామయ్యను సీఎంగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా నియమిస్తూ అంగీకరించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దమైంది.

== నేడే ప్రమాణస్వీకారం

కర్ణాటక ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది.. మధాహ్నం 1.30గంటలకు సుముహుర్తంన సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్, మరికొంత మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకుగాను ప్రభుత్వాధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు పరిశీలిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాజస్తాన్, చత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల సీఎల్పీ, పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమైన నాయకత్వం హాజరుకానున్నారు.

ఇది కూడా చదవండి: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాకు విశేష స్పందన: సీపీ