Telugu News

హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు

కర్నాటక-విజయం న్యూస్

0

హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు
(కర్నాటక-విజయం న్యూస్);-

దేశాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇవాళ కోర్టు తుది తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంటూ ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యా సంస్థల ప్రొటోకాల్‌ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. స్కూల్ యూనిఫాం ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏ మతం వారైనా స్కూల్ ప్రొటోకాల్ పాటించాల్సిందేనని పేర్కొంది

also read;-అసెంబ్లీనా.. ప‌బ్లిక్ మీటింగా..?: భట్టి విక్రమార్క

హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కర్ణాటక ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. చీఫ్ జస్టిస్ అవస్థి ఇంటితోపాటు కేసుతో సంబంధమున్న అందరు జడ్జిల ఇళ్ల వద్ద భద్రత పెంచారు. నిరసన కార్యక్రమాలు జరగకుండా బెంగళూరుతోపాటు కీలక నగరాలు, పట్టణాల్లో ఆంక్షలు విదించిది. బెంగళూరులో మార్చి 15వతేదీ నుంచి వారం రోజులపాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144ని విధించారు.

తీర్పు నేపథ్యంలో ఇవాళ మంగళూరు, శివమొగ్గలో అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసేశారు. కబురగి, దావణగెరె, బెల్గాం, కొప్పల్, గడగ్, హాసన్ జిల్లాల్లో కూడా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.అటు ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.