Telugu News

కృష్ణా తీరంలో ఆదిమానవుడి ఆనవాళ్లు.

నాగార్జున సాగర్, - విజయం న్యూస్ :

0

కృష్ణా తీరంలో ఆదిమానవుడి ఆనవాళ్లు

నాగార్జున సాగర్, – విజయం న్యూస్ :
నాగార్జున సాగర్ ప్రపంచ పర్యాటక కేంద్రాల్లో పేరుపొందిన నాగార్జున సాగర్లోని బుద్ధ వనం పరిసర ప్రాంతాల్లో ఆదిమానవుల ఆనవాళ్లు కనపడినట్టు పురావస్తు శాఖ పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే పిచ్ ఇండియా పౌండేషన సీఈఓ బుద్ధవనం కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి ప్రకారం బుద్ధ వనం నుండి కృష్ణా నది పరిసర ప్రాంతాలలో వెళ్తున్న దారిలో ఆదిమానవుడి ఆనవాళ్లు కనిపించినట్లు తెలిపారు.ఈ నెల 27 సోమవారం ఉదయం అన్ని పత్రికా సంపాదకులు బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో కృష్ణా తీరం వరకు ఏర్పాటు చేసిన కాలిబాలో ప్రతికార సంపాదక బృందం ప్రయాణిస్తూ ఉండగా కొత్తరాతి యుగం నాటి ఆనవాళ్లు కనిపించినట్లు

నాగిరెడ్డి తెలిపారు. రాత్రి పనిముట్లు అరగదీసిన గుంటలు కనిపించాయని ఇవి సుమారు క్రీస్తు పూర్వం 4000 నుండి 2000 వరకు ఉంటాయని తెలిపారు. వీరి వెంట తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి వెలుగు పత్రిక సంపాదకులు చంద్రమౌళి పిన్నిర్ ప్రతినిధి మేళ్లి మైత్రేయిబౌద్ధ నిపుణులు సంతోష్ రావత్ బుద్ధవనం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

also read;-అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్