Telugu News

మంత్రి పర్యటనలో ఉద్రిక్తత

మంత్రి హరీష్ రావు ను అడ్డుకునేందుకు బుడగ జంగాలు.

0

మంత్రి పర్యటనలో ఉద్రిక్తత
మంత్రి హరీష్ రావు ను అడ్డుకునేందుకు బుడగ జంగాలు.
మహిళలను అడ్డుకున్న పోలీసులు.
(వెల్దూర్తి-విజయంన్యూస్)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఆర్థిక మంత్రి ఇ హరీష్ రావు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు ను అడ్డుకునేందుకు గ్రామానికి చెందిన బుడగజంగాలు సుమారు 30 మంది మహిళలు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రావడంలేదని అనర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారని మాకు ఉండటానికి ఇల్లు లేని దీన స్థితిలో ఉన్న మా కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సరి కూలీలుగా పనులు చేసుకుంటూ ఏ పూటకాపూట తెచ్చుకొని తినే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని, పలుకుబడి గల వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని వారు ఆరోపించారు.

also read :-రోడ్డు ప్రమాదంలో పసికందు సహా ఐదుగురు దుర్మరణం

హరీష్ రావు కాన్వాయ్ కి అడ్డుకునేందుకు వచ్చిన మహిళలను పోలీసులు కాన్వాయ్ వద్దకు రాకుండా నిర్వహించారు. కాగా గ్రామంలో హరీష్ రావు పర్యటన ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేసి ఇ చిన్నకోడూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.