Telugu News

శివరాత్రి జాతర ఏర్పాట్ల దండిగా ఉండాలే : మంత్రి దయాకర్ రావు

అధికారులతో సమీక్ష చేసిన మంత్రి

0

==శివరాత్రి జాతర ఏర్పాట్ల దండిగా ఉండాలే : మంత్రి దయాకర్ రావు
== అధికారులతో సమీక్ష చేసిన మంత్రి
==(వరంగల్-విజయంన్యూస్);-
పాలకుర్తి శ్రీసోమేశ్వరలక్ష్మి నర్సింహ స్వామి దేవాయలంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని గ్రామీణాభివద్ది, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు సూచించారు. బుధవారం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం అధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జతరపై సంబంధిత, వివిధ శాఖల అధికారులతో పాలకుర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షించారు.

also read :-ఉస్మానియావిద్యార్థుల ఆకలి తీర్చిన అమ్మల సంఘం అధ్యక్షురాలు అల్లం పద్మ 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, అత్యంత మహిమాన్విత క్షేత్రంగా పాలకుర్తి కి పేరుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా శంకరుడు, విష్ణువు వేర్వేరుగా స్వయంభువులుగా వెలసిన క్షేత్రం లేదు. ఇలాంటి క్షేత్రం వల్ల, తొలి తెలుగు కవి, ఇక్కడి పాల్కురికి సోమనాథ కవి వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరు గుర్తింపు ఉంది. ఈ ప్రాంతం ఎంతో చరిత్రాత్మకం. ప్రతి ఏటా మహా శివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సారి కూడా ఘనంగా జాతర ఏర్పాట్లు జరగాలి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. అని మంత్రి అధికారులను ఆదేశించారు.

also read :-మేడారం జాతర హుండీల లెక్కింపుఆరంభం

టూరిజం కింద పాలకుర్తి దేవాలయానికి రూ. 15 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. దేవాలయ మంటపానికి గ్రానైట్ వేస్తున్నారు. గిరి ప్రదక్షిణ రోడ్లకు లైట్స్ పెట్టాలి.మసీదు దగ్గర రోడ్డుకు సీసీ వేయాలి. జనగామ, వరంగల్, తొర్రూరు, సూర్యాపేట ఇతర రహదారుల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. రోడ్లకు ఇరువైపులా మట్టి పోసి బాగు చేయాలి. మిషన్ భగీరథ ద్వారా 24 గంటలపాటు మంచినీరు, ఆరోగ్య శిబిరాలు, పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. అనుభవం ఉన్న అధికారుల సేవలను జాతరకు అధికారులు వినియోగించాలి.

also read :-శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం..

రామచంద్రయ్య శర్మ అధ్వర్యంలో తాత్కాలిక కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ జాతర వరకు పని చేస్తుంది. భక్తుల సదుపాయాల విషయంలో రాజీ పడొడ్డు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఏర్పాట్లు, జాతర నిర్వహణ ఉండాలి. బందోబస్తు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ లు శ్రమించాలి. ఆర్టీసీ బస్సులు అన్ని డిపోల నుండి నడిపించాలి. అధికారులు సమన్వయంతో పని చేయాలి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ఆయా శాఖల అధికారులు, దేవాలయ సిబ్బంది, పూజారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.