Telugu News

బిజెపిప్రజాదరణ పాలన విశ్వసనీయతతో ప్రపంచంలోప్రధాని మోదీ నంబర్ 1

75 ఏళ్ల పాలనలో చేయలేనివి మోదీ నిశ్శబ్దంగా చేసేశారు..!

0

బిజెపిప్రజాదరణ పాలన విశ్వసనీయతతో ప్రపంచంలోప్రధాని మోదీ నంబర్ 1

*75 ఏళ్ల పాలనలో చేయలేనివి మోదీ నిశ్శబ్దంగా చేసేశారు..!

* ఉగ్రవాదం, శత్రు దేశ దూకుడు పై ఉక్కుపాదం…

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర…

ప్రపంచంలోనే బిజెపి ప్రధాని నరేంద్ర మోదీ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకోవడం
మోడీ ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలకున్న నమ్మకం, విశ్వసనీయతను మరోసారి రుజువు చేసిందని , భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప శక్తిగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని మోడీ పాలనకు కూడా నిదర్శనమని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. శనివారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా అనేక సాహసోపేత, చారిత్రక నిర్ణయాలను తీసుకుందని చెప్పారు. 75 ఏళ్ల భారతదేశ పాలనలో చేయలేని నిర్ణయాత్మక పనులను ప్రధాని నరేంద్ర మోడీ 7 ఏళ్ల పాలనలో శబ్దంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, 370 ఆర్టికల్ రద్దు, నోట్ల రద్దు, జి ఎస్ టి , త్రిపుల్ తలాక్, రామమందిర నిర్మాణం, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, విదేశాలకు కరోనా టికా లాంటి అనేక కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రభుత్వం దిగ్విజయంగా, విజయవంతంగా పూర్తి చేసిందన్నారు.

also read :-ఆదిత్య థియేటర్లో అఖండ అర్థ శతదినోత్సవ వేడుకలు

గత భారత దేశ పాలనకు భిన్నంగా కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం తీసుకున్న అనేక సంచలన, చారిత్రక నిర్ణయాలతో దేశానికి ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. 140 కోట్ల దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను కొనసాగిస్తున్న మోడీ ప్రభుత్వ నిర్ణయాలను దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నరని , అందుకే కేంద్రంలోభారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరుగులేని శక్తిగా ఎదిగిందని చెప్పారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, పక్కన శత్రు దేశాలదూకుడు పై మోడీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపిందని , ప్రజల భద్రత కోసం , శత్రు దేశాల నుండి దేశాన్ని సురక్షితంగ ఉంచడానికి అనేక కఠిన చర్యలు చేపడుతుందని తెలిపారు. భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలపడానికి దేశ గతి శక్తి మార్చడానికి కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ, పక్కా ప్రణాళికతో ముందుకు
కొనసాగుతుందన్నారు. అందుకే ప్రజా ఆమోదయోగ్యమైన పరిపాలన, జనాదరణ తో ప్రపంచంలో బిజెపి ప్రధాని మోడీ నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నారని , ఇది దేశ ప్రజలందరి విజయమని , గర్వించదగ్గ విషయమన్నారు.