Telugu News

కొత్త కేంద్రీయ విద్యాలయాల‌ (కేవీ) ఏర్పాటుపై చ‌ర్య‌లేవీ?

లోక్‌స‌భ‌లో కేంద్రాన్ని ప్ర‌శ్నించిన ఎంపీ నామ నాగేశ్వ‌ర రావు

0

కొత్త కేంద్రీయ విద్యాలయాల‌ (కేవీ) ఏర్పాటుపై చ‌ర్య‌లేవీ?

లోక్‌స‌భ‌లో కేంద్రాన్ని ప్ర‌శ్నించిన ఎంపీ నామ నాగేశ్వ‌ర రావు

(న్యూఢిల్లీ-విజయంన్యూస్);-

దేశ‌వ్యాప్తంగా రాష్ట్రాల్లోని కొత్త జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాల‌(కేవీ)ఏర్పాటుకు కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు ఏమిట‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌ర్‌రావు ప్రశ్నించారు. ఒక జిల్లాలో ఒక‌టి కంటే ఎక్కువ కేంద్రీయ విద్యాల‌యాలు ఉన్న జిల్లాల‌ను త‌మ‌కు తెల‌పాల‌ని ఆయ‌న కోరారు.

also read;-*మరోసారి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి:

అయితే, ఎంపీ నామ‌ ప్ర‌శ్న‌కు కేంద్ర విద్యా శాఖ లిఖితపూర్వ‌కంగా సోమ‌వారం స్పందించింది. దేశంలో కొత్తగా కేంద్రీయ విద్యాలయాల‌(కేవీ) ఏర్పాటు అనేది నిరంతర ప్రక్రియ అంటూ వివ‌ర‌ణ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, దాని అనుబంధ‌ రంగ సంస్థ‌లకు చెందిన ఉద్యోగుల పిల్ల‌ల విద్యా అవ‌స‌రాలు తీర్చేందుకు కేంద్రీయ విద్యాలయాలు ప్రాథమికంగా ఏర్పాటు చేస్తార‌ని వివ‌రించింది. భారతదేశంలో మొత్తంగా 261 జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ కేవీలు క‌ల్గి ఉన్న‌ట్టు వెల్ల‌డించింది.