Telugu News

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ను పరామర్శించనున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి రాక కోసం ముమ్మర ఏర్పాట్లు

0

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ను పరామర్శించనున్న సీఎం కేసీఆర్
== ముఖ్యమంత్రి రాక కోసం ముమ్మర ఏర్పాట్లు
== మంత్రి స్వగ్రామం పెద్ద తండాకు మహర్దశ
( వరంగల్-విజయంన్యూస్);-
రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తండ్రి శ్రీ గుగులోతు లింగా నాయక్ (85  ఈనెల 17 హఠాన్మరణం చెందడంతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంతాపం తెలియజేశారు. త్వరలో మంత్రి నివాసం పెద్దతండాకు వచ్చి పరామర్శించనున్నారు. దీంతో పెద్ద తండాకు మహర్ధశ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా మంత్రి స్వగ్రామం పెద్ద తండా, గుండ్రాతిమడుగు, కురవి మండలం, మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.సీఎం కేసీఆర్ తో పాటు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున రానున్నందున… అందుకు తగిన ఏర్పాట్ల కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి.

also read :-దేశానికే తలమానికంగా మానేరు రివర్ ప్రంట్2.6 కిలోమీటర్ల పనులకు టెండర్లు

మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, కురవి జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, మున్సిపల్ నాయకులు యార్ల మురళీధర్ రెడ్డి, టి.ఆర్.ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మూల మధుకర్ రెడ్డి, నూకల శ్రీ రంగా రెడ్డి, శ్రీరామ్ నాయక్, శ్రీకాంత్ నాయక్, సుందర్ నాయక్, అఫ్జల్, దుర్గా ప్రసాద్, ప్యాట్ని సురేష్, రామ్ లాల్, బోడ శ్రీను తదితర నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.