నరేంద్ర మోడీనే దేశానికి రక్ష
== టిఆర్ఎస్ , కాంగ్రెస్ ది ఢిల్లీ లో దోస్తీ గల్లీలో కుస్తీ
== టీఆర్ఎసోళ్లది చిల్లరి రాజకీయాలు.. కాంగ్రెసోళ్లది కుస్తీ రాజకీయాలు
== రైతన్నలకు ఏం చేశారని సంఘర్షణ సభ పెట్టిండ్రూ
== అధికారంలో ఉన్నప్పుడు లాఠీదెబ్బలు.. అధికారం దిగిన తరువాత చవితిప్రేమ
== రైతులను ఆదుకునేది బీజేపీ మాత్రమే
== విలేకర్ల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి
(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశానికే రక్ష లాంటి వారని, ఆయన దేశ ప్రజల కోసం అనేక పథకాలకు శ్రీకారం చుట్టి పేద ప్రజలకు ఆశాజ్యోతిగా నిలుస్తున్న ఆదర్శనీయుడు నరేంద్రమోదీ అని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.శనివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడురు. కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచాన్నే వణికిస్తూ లక్షలమంది ప్రాణాలను బలితీసుకుంటున్న సందర్భంలో దేశ ప్రగతి కోరుకునే ప్రధానిగా, దేశ ప్రజలకు మేలు చేసే ప్రధానిగా కరోనా నివారణ కోసం అనేక వేగవంతమైన చర్యలు తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ అని కొనియాడారు. కోట్ల రూపాయల ఖర్చు చేసి స్వదేశి వ్యాక్షినేషన్ ఫ్రీ గా వేసిన ఘనత మోడీ దేనని అన్నారు. దేశానికి ఏం చేశారని, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో తెలియదు కానీ వరంగల్ లో మీటింగ్ పెట్టిన రాహుల్ గాంధీ ప్రపంచానికే ఆదర్శ ప్రధానిపై విషం చిమ్మడం హాస్యాస్పదమన్నరు.
also read :-అన్ని వర్గాల సంక్షేమం సీఎం కేసీఆర్ ఘనతే.. ఎంపీ నామ
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం మేలు చేసిందో సభలో చెప్పలేకపోయారని ఆరోపించారు. అది రైతు సంఘర్షణ సభలా కనిపించలేదని, రాహుల్ గాంధీ సంఘర్షణ సభలా కనిపించిందన్నారు. ఆనాటి కాంగ్రెస్ హాయంలో రైతులు ఎరువుల కోసం, విత్తనాల కోసం పడిగాపులు పడే వారని, కానీ ఎక్కడైనా రైతులు షాపుల ఎదుట గంట సయమం వేచి ఉంటున్నారా..? అని అన్నారు. అది ప్రధాని నరేంద్రమోడీ పాలన అంటే అంటూ కొనియాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఈసంతా కూడా రైతులకు మేలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతులకు ఏదో చేస్తాం, రైతులకు ఏదో ఇస్తామంటూ మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ, టిక్కెట్లను అమ్ముకునే పార్టీ అని ఆరోపించారు. మోడీ రైతు మేలు కోరే అభిరుద్ది సంక్షేమలు ఎన్నో చేశారని తెలిపారు. తెలంగాణ ఇవ్వటంలో ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తద్వారా 1200 మంది బలిదానం చేసుకోవాల్సి వచ్చిందని, ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ అమరవీరుల పాపం తగిలి కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు.
also read :-రైతు సంఘర్షణ సభకు తరలిన ఏన్కూరు నాయకులు.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల గురించి మాట్లాడకుండా రైతులను టార్గెట్ చేసుకుని అధికారమే పరమావధిగా రైతులను అడ్డుపెట్టుకుంటున్నకాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసే ప్రకటనలు చేస్తోందన్నారు. బిజెపి ఎదుగుదల చూసి ఓర్వలేక మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న భయంతో విషం చిమ్ముతున్నరని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తి, గల్లిలో కుస్తి అని, కాంగ్రెస్ కి ఓటు వేస్తే టిఆర్ఎస్ కి వేసినట్టేనని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్ లో గెలిచిన ఎంఎల్ఏ లు అందరూ టిఆర్ఎస్ లోనే కలిశారని, రైతుల గోస టిఆర్ఎస్ కి పట్టదు కాంగ్రెస్ కి పట్టదు, రైతులు ఆత్మహత్య చేసుకునేది కేవలం టిఆర్ఎస్ వల్లే సాధ్యమని అన్నారు.
== మసీదులకు రూ.51లక్షలు ఇచ్చారు : జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ
మంత్రి పువ్వాడ ఖమ్మం లో ఉన్న 51 మసీదులకు రూ.51 లక్షలు ఇచ్చారు, కానీ హిందుదేవాలయాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. పాత బస్టాండ్ ను తీసేసిన మంత్రి, కొంగత్త అంగులతో నూతన బస్టాండ్ ను నిర్మాణం చేశారని, కానీ ఆ బస్టాండ్ లో ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని , విగ్రహాన్ని ఎందుకు నూతన బస్టాండ్ కు తీసుకెళ్లలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తుంటే, రాష్ట్ర మంత్రులు మాత్రమే బీజేపీ ఒక్క పైసా రిలీజ్ చేయలేదని సూచించారు. ఖమ్మం నగరంలో ఖర్చు చేసే ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులేనని అన్నారు. మంత్రి పువ్వాడ ఖమ్మంకు చేసింది ఏమి లేదని, ఆయన ఇంటిపేరు, ఒంటిపేరు పక్కనే పక్కన ఖాన్ అని తప్పా పువ్వాడ అజయ్ సాధించింది ఏమి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హాజరైయ్యారు.