కొత్త బాస్
ఆర్మీ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే
(దిల్లీ -విజయం న్యూస్ ):-
దిల్లీ:-భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను కేంద్ర ప్రభుత్వం నియమించింది.ఇప్పటికే ఈ పోస్టులో ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే భారత రెండో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యే అవకాశం ఉండటంతో ఆయన స్థానాన్ని పాండేతో భర్తీ చేసినట్లు తెలుస్తోంది.భారత్ సైన్యంలో నరవణే తర్వాత అత్యంత సీనియర్ అధికారి కూడా ఈయనే కావడం గమనార్హం.