Telugu News

*ఢిల్లీలో మోగిన మున్సిపల్‌  ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల ఎస్ఈసీ

0

*ఢిల్లీలో మోగిన మున్సిపల్‌  ఎన్నికల నగారా

 == షెడ్యూల్‌ విడుదల ఎస్ఈసీ..

== పోలింగ్‌ ఎప్పుడంటే..?

(న్యూఢిల్లీ-విజయం న్యూస్):

ఒకవైపు రాష్ట్రాల జనరల్  ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేస్తున్నా ఎన్నికల కమిషన్.. మరో వైపు స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అందులో భాగంగా నిన్న గుజరాత్ జనరల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ, శుక్రవారం ఢిల్లీలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

ఇది కూడా చదవండి:- ఖమ్మం నగరం అభివృద్దికి అందరు సహాకరించండి: మంత్రి

దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఢిల్లీ స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ విజయ్‌ దేవ్‌ ఈ సాయంత్రం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆ షెడ్యూల్‌ ప్రకారం.. డిసెంబర్‌ 4న ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 7న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.*

*ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 7న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 14న నామినేషన్‌ల గడువు ముగియనుంది. అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 19 ఆఖరి తేదీగా నిర్ణయించారు. కాగా, ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో ఇవాళ్టి నుంచే ఢిల్లీలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని విజయ్‌ దేవ్‌ పేర్కొన్నారు.*

ఇది కూడా చదవండి:- జుజ్జులరావుపేటలో రైతుల పేరుతో ‘రియల్ మోసం’

*ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నదని ఎన్నికల కమిషనర్‌ విజయ్‌ దేవ్‌ చెప్పారు. మొత్తం 250 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని, అందులో 42 వార్డులు ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలని ఆయన తెలిపారు.*