గత మూడేండ్లలో రైల్వేల్లోని నియామకాలెన్ని: నామా నాగేశ్వరరావు
కేంద్ర రైల్వే శాఖను ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు
గత మూడేండ్లలో రైల్వేల్లోని నియామకాలెన్ని: నామా నాగేశ్వరరావు
కేంద్ర రైల్వే శాఖను ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు
(న్యూఢిల్లీః విజయం న్యూస్):-
గత మూడు సంవత్సరాలుగా భారత రైల్వేల్లో ఎన్ని నియామకాలు జరిపారని? మరెన్ని రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించారని ఖమ్మం లోక్‌సభ సభ్యులు నామ నాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనకు ప్రశ్నకు బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
also read;-గౌరవ వేతనం పెంపుతో54,201 మందికి లబ్ది
అయితే, ఈ అంశాలన్నీ తాము పార్లమెంట్‌కు ఇదివరకు సమర్పించామని వెల్లడించారు. రైల్వేలో నియామకాలు జోన్లవారీగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. ఖాళీల ఆధారంగా తాము తరచూ నియామకాలు చేపడుతున్నామని చెప్పారు. ఫలితాల వెల్లడికి ప్రత్యేకంగా సమయం అంటూ లేదని, నియామక ప్రక్రియలో భాగంగా వెల్లడిస్తున్నామని తెలిపారు.