Telugu News

పద్మశ్రీ అవార్డు గ్రహీత దంపతులకు పొంగులేటి ఘన సన్మానంరూ.50వేల ఆర్థిక సాయం

మణుగూరు -విజయంన్యూస్

0

===పద్మశ్రీ అవార్డు గ్రహీత దంపతులకు పొంగులేటి ఘన సన్మానంరూ.50వేల ఆర్థిక సాయం

===(మణుగూరు -విజయంన్యూస్);-

మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య దంపతులను సోమవారం ఆయన నివాసం వద్దకు వెళ్లి తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం అతనికి రూ. 50 వేలను ఆర్థిక సహాయంగా అందచేశారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర వెయేళ్ల ప్రాశస్త్యన్ని ఘంటాపథంగా కొయ్య భాషలో చెప్పగలిగే పగిడి కళాకారుడు సకిని రామచంద్రయ్య మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కావటం విశేషం అన్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుతో అతన్ని సత్కారించటం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని అన్ని రకాల కళలకు పెద్దపీఠ వేయటం జరిగిందని పేర్కొన్నారు.

also read :-అధైర్యపడొద్దు అండగా ఉంటా- మాజీ ఎంపీ పొంగులేటి

ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య , తెరాస రాష్ట్ర కార్యదర్శి డా. తెల్లం వెంకట్రావ్, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణరెడ్డి, స్థానిక ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.