Telugu News

డిసెంబర్‌ 1 నుంచి హైకో‌ర్టులో ఏ–ఫోర్‌ ప్రింట్లకు అను‌మతి.

డిసెంబర్‌ 1 నుంచి హైకో‌ర్టులో పిటి‌షన్లు,

0

డిసెంబర్‌ 1 నుంచి హైకో‌ర్టులో ఏ–ఫోర్‌ ప్రింట్లకు అను‌మతి.

హైద‌రా‌బాద్: డిసెంబర్‌ 1 నుంచి హైకో‌ర్టులో పిటి‌షన్లు, కౌంటర్‌ పిటి‌షన్లు సహా ఇతర అన్ని రకాల పిటి‌ష‌న్లను ఏ4 సైజ్‌ పేప‌రుపై ఇరు‌వై‌పులా ప్రింట్‌తీసి దాఖలు చేసేం‌దుకు హైకోర్టు అను‌మ‌తిం‌చింది. ఈమేరకు హైకోర్టు రిజిర్‌స్టార్‌ జన‌రల్‌ నాగా‌ర్జున ఉత్తర్వులు జారీ‌చే‌శారు. ఇప్పటి‌వ‌రకు లీగల్‌ సైజ్‌ పేప‌రులో ఒక‌వైపే ప్రింట్‌ తీసిన పిటి‌ష‌న్లను దాఖలు చేసేం‌దుకు అను‌మతి ఉంది.

హైకోర్టు, కింది కోర్టుల్లో ఏ–ఫోర్‌ సైజ్‌లో రెండు‌వై‌పులా ప్రింట్‌ తీసిన వాటిని అను‌మ‌తిం‌చేలా ఆదే‌శిం‌చా‌లని కోరుతూ నగర న్యాయ‌వాది మయూర్‌ ముంద్రా ఇటీ‌వల ప్రజా‌హిత వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని 10 హైకో‌ర్టులు ఇప్పటికే ఇలాంటి అను‌మతి మంజూరు చేశా‌యని పిటి‌ష‌నర్‌ తెలి‌పారు. ఇటీ‌వల ఫుల్‌‌కోర్టు (హై‌కోర్టున్యాయ‌మూ‌ర్తు‌లంతా) సమా‌వేశం దీనిపై సాను‌కూల నిర్ణయం తీసు‌కు‌న్నది.

also read :- ముదిరాజ్ మరియు IMA వన సమారాధనలో పాల్గొన్న మంత్రి పువ్వాడ..