Telugu News

పిల్లర్ రోడ్డు విస్తరణ 40 ఫీట్ల రోడ్డు చాలు

*వ్యాపార యజమానులు కోరుతున్నారు

0

పిల్లర్ రోడ్డు విస్తరణ 40 ఫీట్ల రోడ్డు చాలు
*వ్యాపార యజమానులు కోరుతున్నారు
( నాగార్జునసాగర్ – విజయం న్యూస్)
60 ఫీట్ల రోడ్డు వద్దు 40 ఫీట్ల రోడ్డు కావాలి అని పైలాన్ బస్టాండ్ వ్యాపార దుకాణాల యజమానులు కోరుతున్నారు. శుక్రవారం వ్యాపార సముదాయం మధ్య వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ళ నుండి ఇక్కడ దుకాణాలలో వ్యాపారం చేసుకుంటున్నామని రోడ్డు విస్తరణలో తమ దుకాణాలుపోతే తమ జీవనాధారం కోల్పోతామని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 40 ఫీట్ రోడ్డు మాత్రమే వేయాలని వ్యాపారులు కోరుతున్నారు.

also read ;-దిగుడా..? దూకుడా..? పొంగులేటి దారేటు..

నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా పిల్లల రోడ్డును 60 ఫీట్ రోడ్డుగా విస్తరణ చేయాలని ప్రణాళికలు సిద్ధం అవుతుండడంతో. అందుకు సంబంధించి సర్వే కోనసాగుతోంది.60 ఫీట్ల రోడ్డు చేయడం వలన ఇక్కడ రోడ్లకు ఇరువైపుల ఉన్న వ్యాపార దుకాణాలు చాలావరకూ కోల్పోతున్నామని తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యాపారులు అజ్గర్, దాసు గంజి శ్రీను, లింగం,పహీమ్, హజరత్, వెంకటేశ్వర్లు, నజీమ్ తదితరులు ఉన్నారు.