Telugu News

ముంబై గులాబీమ‌యం.. సీఎం కేసీఆర్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్‌

విజయం న్యూస్

0

ముంబై గులాబీమ‌యం.. సీఎం కేసీఆర్‌కు గ్రాండ్ వెల్‌క‌మ్‌

(విజయం న్యూస్):-

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై గులాబీమ‌యం అయిపోయింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ ఇవాళ ముంబై వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో ముంబై వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌కు వెల్‌క‌ప్ చెబుతూ ప‌లు పోస్ట‌ర్లు ఔత్సాహికులు ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేను.. కేసీఆర్ క‌లిశారు. కొద్దిసేప‌ట్లో ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌ను క‌ల‌వ‌నున్నారు.

also read :-డాక్టర్ రాజారెడ్డి  అంతిమయాత్ర పాల్గొన్న మంత్రి కొప్పుల

తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్‌కు మ‌హారాష్ట్ర వ‌స్తున్నందుకు వెల్‌క‌మ్ అంటూ పోస్ట‌ర్లు ఏర్పాటు చేశారు. అలాగే.. ఆ పోస్ట‌ర్ల‌లో సీఎం కేసీఆర్ ఫోటోతో పాటు శివ‌సేన ఫౌండ‌ర్ బాల్ థాక‌రే, మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ థాక‌రే, ఎస్పీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఫోటోలు ఉన్నాయి