కోనసీమలో విధ్వంస ఘటనల వెనుక ఉన్న అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలి.
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సిగ్గు చేటు..!
– అఖిల భారత గిరిజన సమాఖ్య, జాతీయ అధ్యక్షులు గుగులోతు వెంకన్న నాయక్.
(మహబూబాబాద్- విజయం న్యూస్);-
ఎన్టీఆర్, వైఎస్సార్,అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెడితే లేని అభ్యంతరం అంబేద్కర్ పేరు పైనే ఎందుకు ?
భారత రత్న ,భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ వ్యాప్తంగా మేధావిగా పేరు గాంచిన డా. బి ఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని సహించలేని అరాచక శక్తులు విధ్వంసాలు సృష్టించడం దారుణమని ,ఈ దాడులు , విధ్వంసాలకు పాల్పడిన వారిని, వెనుక ఉన్న శక్తులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.కోనసీమ కు డా బి. ఆర్. అంబేద్కర్ పేరు పెట్టాలని స్థానిక అన్ని వర్గాల ప్రజలు, గిరిజన సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేసాయి.ఇప్పుడు అంబేద్కర్ పేరు పెట్టిన తరువాత ఆ పేరును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయడం, విధ్వంసలకు తెగబడడం చూస్తుంటే దీని వెనుక భయంకరమైన కుట్రలు వెనకబడిన వర్గాలపై జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
ALSO READ :-విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వం తక్షణమే పాత్రధారులను ,కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం.నూతనంగా ఏర్పడిన వివిధ జిల్లాలకు అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, వైఎస్సార్,అల్లూరి అన్నమయ్య ,పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెడితే లేని అభ్యంతరం అంబేద్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తుంది ? కుల ఉన్మాదంతో రాజ్యాంగ నిర్మాతను అవమానించడం తగదు.ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న అంబేద్కర్ గారి పేరు పెడితే కోనసీమ గౌరవం పెరుగుతుందే తప్ప అవగింజత కూడా తగ్గదు. ఈ సత్యాన్ని కోనసీమ ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి వెనకబడిన వర్గాల ఇండ్లపై దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని,ఈ ఘటనల వెనుక జరుగుతున్న కుట్రలను బయటపెట్టాలని కుట్రదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. కొంత మంది అరాచక శక్తుల దౌర్జనాలకు భయపడి ప్రభుత్వం అంబేద్కర్ పేరు విషయంలో వెనక్కి తగ్గితే గిరిజనులు, దళితులు, బీసీలు పిడితులు సహించరని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం.