Telugu News

పంజాబ్‌ విజయంపై కేజ్రీవాల్‌కు ప్రధాని అభినందన

== కేజ్రీవాల్‌తో కాబోయే పంజాబ్‌ సిఎం మాన్‌ భేటీ

0

పంజాబ్‌ విజయంపై కేజ్రీవాల్‌కు ప్రధాని అభినందన
== కేజ్రీవాల్‌తో కాబోయే పంజాబ్‌ సిఎం మాన్‌ భేటీ
== తెలంగాణలో కెసిఆర్‌ అవినతిపై పోరాడుతామన్న సోమ్‌నాథ్‌ భారతి
(న్యూఢల్లీ-విజయంన్యూస్)
పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఢల్లీి సిఎం కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు. పంజాబ్‌ సంక్షేమం కోసం కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని హావిూ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌లో ఆప్‌ను, అరవింద్‌ కేజీవ్రాల్‌ను అభినందించారు. పంజాబ్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌కు కేజీవ్రాల్‌ వెంటనే స్పందించారు. ’థాంక్యూ సార్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. 117 సీట్ల పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ 92 సీట్లు గెలుచుకుని అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించారు

also read :-యాసంగి వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే: భ‌ట్టి

బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. ఇదిలావుంటే పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న భగవంత్‌ మాన్‌, ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌కు పాదాభివందనం చేశారు. గురువారం విడుదలైన ఫలితాల్లో పంజాబ్‌లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఫలితాల అనంతరంకేజీవ్రాల్‌ను కలిసేందుకు ఆయన శుక్రవారం ఢల్లీికి వెళ్లారు. కేజీవ్రాల్‌ను సవిూపిస్తూనే పాదాభివందనం చేశారు. అనంతరం మాన్‌ను కేజీవ్రాల్‌ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇదిలావుంటే ఎంసీడీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనను ఎన్నికల కమిషన్‌ ఇటీవల వాయిదా వేయడంపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ శుక్రవారంనాడు స్పందించారు.

also read :-వాళ్లవి బెదిరింపు రాజకీయాలు , త్వరలోనే కీలక నిర్ణయం,

ముకుళిత హస్తాలతో ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికలు జరిగేలా చూడమని వేడుకుంటున్నాను. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. దేశం ముఖ్యం, రాజకీయ పార్టీలు కాదు. ఎన్నికల కమిషన్‌పై మనం ఒత్తిడి తెస్తే, వ్యవస్థలు బలహీనమవుతాయి. వ్యవస్థలు బలహీనంగా కాకుండా మనం చూడాలి. వ్యవస్థలు బలహీనమైతే ప్రజాస్వామ్యం, దేశం బలహీనమవుతాయని ప్రధానికి ఒక ట్వీట్‌లో కేజీవ్రాల్‌ విజ్ఞప్తి చేశారు. ఇకపోతే దేశవ్యాప్తంగా ఆప్‌ పార్టీకి ప్రజాదరణ పెరుగుతోందని ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి అన్నారు. పంజాబ్‌ రాష్ట్రంలో ఆప్‌ ఘన విజయం సాధించిన నేపథ్యంలో విూడియాతో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 14 నుంచి తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఆప్‌ను విస్తరింపజేస్తామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. తెలంగాణలో అన్నివర్గాలకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.