Telugu News

ప్రధాని మోడీ కి పంజాబ్ లో అడ్డుగా నిలిచిన ఆందోళనకారుల లక్ష్యం ఏంటి..?

* రైతు చట్టాలను రద్దు చేసిన ఆందోళన చేయడంలో అంతర్యాన్ని గ్రహించాలి...

0

ప్రధాని మోడీ కి పంజాబ్ లో అడ్డుగా నిలిచిన ఆందోళనకారుల లక్ష్యం ఏంటి..?

* రైతు చట్టాలను రద్దు చేసిన ఆందోళన చేయడంలో అంతర్యాన్ని గ్రహించాలి…

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ..

రైతులకు మేలు చేసే చట్టాలను రద్దు చేసిన అనంతరం కూడా పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో నిరసనకారుల ఆందోళన ఎందుకు ..? ఏ ఎజెండా అమలు కోసం ప్రధానికి అడ్డుగా వెళ్ళింది, వారి లక్ష్యం, ఆంతర్యం ఏమిటో దేశ ప్రజలందరూ గ్రహించాలని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర కోరారు. శుక్రవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు, శంకు స్థాపన కోసం ప్రధానిమోడీ ఆ రాష్ట్రానికి పర్యటన కోసం వెళితే నిరసనకారులు అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని? వ్యవసాయ చట్టాలను రద్దు చేసినా కూడాప్రధాని మోడీ పర్యటన లో పంజాబ్ లో నిరసన చేసే అవసరం ఏముంది ఆయన ప్రశ్నించారు. పంజాబ్లో కొన్ని దుష్ట శక్తులు వారి ఎజెండా అమలు

also read :-ఎంత పనిచేస్తివి బిడ్డా!

పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాని మోడీ భద్రత  కోసం పనిచేస్తుందనే విషయాన్ని దేశ ప్రజలందరూ గ్రహించారని చెప్పారు. ముఖ్యంగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విచ్చిన్నకర శక్తులతో కలిసి పని చేస్తుందని, పక్కా ప్రణాళిక ప్రకారమే ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకోవాలని చూసిందని పేర్కొన్నారు .పట్ల వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు దారి తీస్తుందని , భద్రతా ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందా..? లేక వన్ ఏమైనా కుట్ర చేసిందా…? అనే అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ పంజాబ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం లోపభూయిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందన్నారు . ఆందోళనకారులను ప్రధాని ప్రయాణించే మార్గంలో నిలువరించ లేకపోవడం, ప్రధాని రూట్ మ్యాప్ మారినా ఆందోళనకారులకు ఆ మార్గం , సమయం గురించి తెలియడం, ప్రధాని కాన్వాయ్ పర్యటన లో పంజాబ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డిజిపి లేకపోవడం, ఆందోళనకారుల గురించి జరుగుతున్న పరిణామాలను పంజాబ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడానికి ఫోన్ చేసినా స్పందించకపోవడం లాంటి అనేక అంశాలు అనుమానానికి తావిస్తున్నాయన్నారు.

also read:-నేడు వామన అవతారంలో దర్శనమిస్తున్న

పంజాబ్ రాష్ట్రానికి పొరుగున ఉన్న పక్క పాకిస్తాన్ దేశానికి, ఖలిస్తాన్ ఉద్యమానికి పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచి కొంతమంది దుష్ట శక్తులతో మోడీ పర్యటనను అడ్డుకోని , దాడి చేయాలని ప్రయత్నం చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.దేశం నుండి పంజాబ్ రాష్ట్రాన్ని వేరుచేసే ఎజెండా అమలు చేయాలనే ఆలోచనతో కొన్ని దుష్ట శక్తులు ఇలాంటి సాహసానికి ఒడిగట్టారని , . దేశ ప్రజలందరూ ఇట్టి అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పంజాబ్లోకొన్ని దుష్ట శక్తులు ఆందోళనకారులు రోడ్డును బ్లాక్ చేసి ప్రధాని మోడీ పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడి ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు . ఆందోళనకారుల మధ్యలో ప్రధాని మోడీ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాలు వేచి ఉన్నా , ఆందోళనకారులను చెదరగొట్ట కపోవడం, మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ భద్రతా నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.

also read :-కొత్తగూడెం లో కొనసాగుతున్న బంద్…

రైతులు చట్టాలను వెనక్కి తీసుకున్నా పంజాబ్ రాష్ట్రంలో ఆందోళనకారులు ప్రధాని మోడీ పర్యటన అడ్డగించడం , అక్కడి రాష్ట్రం మోడీకి సరైన భద్రత కల్పించడం చూస్తే పథకం ప్రకారం కుట్ర చేసినట్లు కనబడుతుందన్నారు. ప్రధాని ఇందిరా గాంధీ హత్య మాదిరిగానే మోడీ పై పగ తీర్చుకుంటానని కొన్ని విధ్వంసక శక్తులు ప్రకటనలు చేసినా, కాంగ్రెస్ పంజాబ్ ప్రభుత్వం భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, దుష్ట శక్తులకు మద్దతిచ్చి నట్టుగా ప్రవర్తించడం దారుణమన్నారు. భారత దేశంలో ఉంటూ దేశం తిండి తింటూ పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ పట్ల వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు . పంజాబ్లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలను లోతుగా దర్యాప్తు చేయాలని దర్యాప్తు సంస్థలను ఆయన కోరారు.